తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అంజనాద్రి 2.0 - జై హనుమాన్‌ కొత్త అద్భుతాన్ని చూశారా? - Jai Hanuman Anjanadri - JAI HANUMAN ANJANADRI

Jai Hanuman Anjanadri 2.0 video : ఈ సంక్రాంతికి హనుమాన్​తో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ పార్ట్​ 2గా జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అంజనాద్రి 2.0 అంటూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు ప్రశాంత వర్మ. మీరు చూశారా?

అంజనాద్రి 2.0 -  జై హనుమాన్‌ కొత్త వీడియో చూశారా?
అంజనాద్రి 2.0 - జై హనుమాన్‌ కొత్త వీడియో చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:55 AM IST

Updated : Mar 31, 2024, 11:29 AM IST

Jai Hanuman Anjanadri 2.0 video :ఈ సంక్రాంతికి హనుమాన్​తో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్​ను అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ పార్ట్​ 2గా జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి అంజనాద్రి 2.0 అంటూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. చుట్టూ అందమైన కొండలు, మధ్యలో పెద్ద నది, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ - వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0 అని రాసుకొచ్చారు. #Jai Hanuman హ్యాష్‌ట్యాగ్​ను జత చేశారు. అలాగే హనుమాన్‌లోని రఘునందన పాటను జత చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, తొలి భాగం క్లైమాక్స్​లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముగించారు. దీనినే ప్రధాన అంశంగా ఇప్పుడు జై హనుమాన్​ను తెరకెక్కిస్తున్నారు. 2025లో ఇది విడుదల కానుంది.

హనుమాన్ చిత్రంలో యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించారు. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి 2024కు ఇతర పెద్ద సినిమాలతో పోటీగా వచ్చి వాటిని బీట్ చేసి మరి విజేతగా నిలిచింది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్లింది. దాదాపు అతి తక్కువ(రూ.30 కోట్లలోపు) బడ్జెట్​తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైగానే కలెక్ట్‌(Hanuman Movie Collections) చేసి వండర్స్ క్రియేట్ చేసింది. దీంతో రెండో భాగం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి సందర్భంగా ఏదైనా పోస్టర్​ను విడుదల చేసే అవకాశం ఉంది. సినిమలో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్‌ హీరో కనిపిస్తారని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పారు. కానీ ఆ స్టార్‌ హీరో ఎవరో ఇంకా ఫైనలైజ్​ చేయలేదు. ప్రస్తుతం హనుమాన్‌ సినిమా తెలుగు వెర్షన్​ జీ5లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. హిందీ వెర్షన్ జీయో సినిమాలో ఉంది.

Last Updated : Mar 31, 2024, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details