Private Island Celebrity Heroine India :సెలబ్రిటీల లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటూ ఎంతో లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. చాలా మంది తారలు తమ సంపాదించే డబ్బులో ఎక్కువ మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెడుతుంటారు. విలాసవంతమైన, అత్యాధునిక సౌకర్యాలు ఉన్న ప్రాపర్టీస్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది తారలు మాత్రమే ప్రైవేట్ ఐలాండ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇండియాలో కేవలం ముగ్గురు బాలీవుడ్ తారలకు మాత్రమే ప్రైవేట్ ఇలాండ్ ఉందట! వారిలో ఒకరు బాలీవుడ్ నటి అని తెలిసిందే.
ఇంతకీ ఆమె ఎవరంటే? - ఇండియాలో రెచెస్ట్ యాక్ట్రెస్ అనగానే చాలా మందికి ఐశ్వర్య రాయ్ పేరే గుర్తొస్తుంది. కానీ ఆమె ఎటువంటి ఐలాండ్‌ను కొనుగోలు చేయలేదంట. ఇక ప్రస్తుతం ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వారికి కూడా ప్రైవేట్ ఐలాండ్‌ను ఏమీ లేవట. అలానే టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఇలా వీరు కూడా బంగ్లాను లేదా ఇతర స్థలాలను కొనుగోలు చేశారే కానీ ఐలాండ్‌ను కొనలేదట. అయితే మరి ఇంతకీ ప్రైవేట్ ఐలాండ్‌ను కొన్న నటి ఎవరంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacquelin Fernandez Own Island) అని తెలిసింది. డీఎన్ఏ ఇంగ్లీష్ మీడియా ఎంటర్టైనర్ వెబ్సైట్లో ఈ వార్త రాసి ఉంది.
గత ఎనిమిదేళ్లుగా నో హిట్ (Jacquelin Fernandez Movies) - ఈ శ్రీలంక నటి గత 15 ఏళ్లుగా బాలీవుడ్లో కొనసాగుతోంది. 2009లో 'అలాడిన్'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి విజయాన్ని ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లకు 'మర్డర్ 2'తో అందుకుంది. అనంతరం ఐదేళ్లలో ఐదు భారీ హిట్లను సొంతం చేసుకుంది. మర్డర్ 2, హౌస్ ఫుల్ 2, రేస్ 2, కిక్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో స్టార్ నటిగా ఎదిగింది. అయితే గత ఎనిమిదేళ్లుగా ఆమెకు ఎలాంటి హిట్ పడలేదు. 2016లో హౌస్ ఫుల్ 3తో చివరిసారిగా విజయాన్ని అందుకుంది. చివరిసారిగా ఆమె 2022లో సర్కస్ చిత్రంతో బాక్సాఫీస్ ముందు సందడి చేసింది. 2023లో సెల్ఫీ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ నటిస్తున్న వెల్కమ్ టు జంగిల్ చిత్రంలో నటిస్తోంది.
రూ.3 కోట్లకు కొనుగోలు - అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, 2012లో తన హోమ్ కంట్రీ లంకలో ఓ ప్రైవేట్ ఐలాంట్ను కొనుగోలు చేసిందట. అప్పట్లో కేవలం రూ.3 కోట్లకే దాన్ని సొంతం చేసుకుందట. మర్డర్ 2, హౌస్‌ఫుల్ 2 చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్న సమయంలో, రేస్ 2కు సైన్ చేసే ముందు తీసుకుందట. ఈ ప్రైవేట్ ద్వీపాంలో ఓ విలాసవంతమైన భవనాన్ని నిర్మించాలని అనుకుందట. మరి దాన్ని నివాసంగా ఉపయోగించుకోవాలనుకుందా? లేదా వాణిజ్య ప్రయోజనాల కోసమా అనేది క్లారిటీ లేదు.
'దేవర' రాకకు మరో నెల రోజులే - ఇంట్రెస్టింగ్గా తారక్ డబుల్ షేడ్ పోస్టర్ - NTR Devara
చిరు నటించిన ఆ రెండ్ బ్లాక్ బస్టర్స్‌కు సీక్వెల్! : అనౌన్స్ చేసిన అశ్వినీ దత్ - Chiranjeevi Hit Movie Sequel