తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కుబేరా వెంటపడే శివమణిగా నాగ్​! - Kubera Movie - KUBERA MOVIE

Nagarjuna Kubera Movie : కుబేరా సినిమాలో నాగార్జున పాత్ర గురించి కొత్త సమాచారం అందింది. పూర్తి వివరాలు స్టోరీలో

.
.

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 9:21 PM IST

Nagarjuna Kubera Movie :తమిళ హీరో ధనుశ్​ - దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కుబేరా" సినిమాలో నాగార్జున ఓ ప్రత్యేక ప్రాత్రలో కనిపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందనీ, శేఖర్ కమ్ముల కింగ్​ను కొత్త కోణంలో చూపించనున్నారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం "కుబేరా"లో నాగార్జున మరోసారి పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారని తెలుస్తోంది. స్టైలీష్ కాప్​గా కనిపించనున్నారని అంతా అంటున్నారు. అయితే ఇందులో నాగ్ పాజిటివ్ రోల్​లో కనిపిస్తారా లేదా నెగిటివ్ రోల్​లోనా అని కింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సిల్వర్ స్క్రీన్‌పై నాగర్జున పోలీస్ గెటప్‌లో కనిపించడం కొత్తేం కాదు. గతంలో అరణ్య కాండ, శాంతి క్రాంతి, నిర్ణయం, రక్షణ, ఆవిడా మా ఆవిడే, శివమణి, గగనం, ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాల్లో నాగ్ ఖాకీ దుస్తుల్లో కనిపించారు. ఇందులో శివమణి ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కుబేరాలో కింగ్ పోలీస్​గా​ కనిపించనుండటం విశేషం. కాకపోతే ఈ సారి ఆయన పాత్ర విభిన్నంగా రూపుదిద్దుతున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పటివరూ నాగ్ పాత్రపై కుబేరా టీం నుంచి అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

భారీ రెమ్యునరేషన్ -నాగార్జున కుబేరా ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసినప్పటి నుంచి ఓ బజ్ క్రియేట్ అయింది. శేఖర్ కమ్ముల విజన్ మీద ఉన్న నమ్మకంతో నాగ్ ఈ కథను విన్న వెంటనే ఒప్పుకున్నారట. పైగా ఈ సినిమా కోసం కింగ్ భారీ రెమ్యూనరేషనే అందుకున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

కాగా, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మునుపెన్నడూ కనిపించని అద్భుతమైన లోకేషన్లు చూపించనున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చుతుండగా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన కుబేరా చిత్రం ఫస్ట్ లుక్​కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details