తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

26 నిమిషాల్లోనే 'పుష్ప 2' అదిరే ఘనత - రిలీజ్​కు ముందే 9 రికార్డులు - PUSHPA 2 RECORDS AND REVIEWS

ఐకాన్ స్టార్ అల్లు అర్డున్ నటించిన 'పుష్ప 2' సాధించిన రికార్డులివే.

AlluArjun Pushpa 2 Records
AlluArjun Pushpa 2 Records (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 4:03 PM IST

AlluArjun Pushpa 2 Records : ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' మేనియా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. 'పుష్ప 2' మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. దీంతో మరోసారి 'పుష్ప 1'కు మించిన మేజిక్‌ను క్రియేట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు పుష్ప రాజ్‌ అల్లు అర్జున్. పుష్ప : ది రూల్​తో బాక్సాఫీస్‌ను రూల్‌ చేసేందుకు రెడీగా ఉన్నారు. 'పుష్ప 2' ఈ సారి వైల్డ్​ ఫైర్ అంటూ థియేటర్లలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప తొలి భాగానికి వచ్చిన రికార్డులు, విడుదలకు ముందే 'పుష్ప 2'కు వచ్చిన రికార్డులు ఏంతో తెలుసుకుందాం.

  • ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇండియాలో 6,500, ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్​లో విడుదల చేయనున్నారు. దీంతో 'పుష్ప 2' బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా రికార్డు సృష్టించింది.
  • విదేశాల్లో పుష్ప 2 ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా 50 వేల టికెట్స్ సేల్‌ అయిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డు నెలకొల్పింది.
  • 'పుష్ప 2' ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటలలోపే 40 మిలియన్ల వీక్షణలు పొందిన తొలి దక్షిణాది మూవీ ట్రైలర్‌గా నిలిచింది.
  • 'పుష్ప 2' హిందీ వెర్షన్‌ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా 24 గంటల్లో లక్ష టికెట్స్‌ అమ్ముడుపోయాయి. బాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ టాప్ చిత్రాల జాబితాలో ఈ సినిమా మూడో స్థానంలో నిలిచింది.
  • అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది.
  • పుష్ప 2 మొదటి ఈవెంట్‌ పట్నాలో జరిగింది. హైయెస్ట్‌ లైవ్‌ వ్యూవర్స్‌ నమోదైన తొలి ఈవెంట్‌గా పుష్ప 2 ఈవెంట్‌ నిలిచింది.
  • బుక్‌ మై షోలో 1 మిలియన్‌, పేటీయంలో 1.3 మిలియన్ల మంది పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఆసక్తి నమోదైన చిత్రం కూడా పుష్ప 2 నే కావడం మరో విశేషం.
  • ఈ సినిమాలో సాంగ్స్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో ట్రెండ్‌ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్​గా రిలీజైన స్పెషల్ సాంగ్‌ 18 గంటల్లోనే 25 + మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుంది. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న సౌత్ సాంగ్​గా రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా రిలీజైన పీలింగ్స్ సాంగ్​ కూడా 26 నిమిషాల్లోనే 1 మిలియన్‌ వ్యూస్‌ను బీట్ చేసి ట్రెండింగ్‌లో నిలిచింది.
  • ట్రేడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు రూ.303 కోట్లు కలెక్షన్స్​ చేయొచ్చని అంచనా. ఒకవేళ ఇదే కనుక జరిగితే రూ.300 కోట్లు దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 నిలుస్తుంది.
  • బుక్‌ మై షోలో 1 మిలియన్‌, పేటీయంలో 1.3 మిలియన్ల మంది పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్థాయిలో ఆసక్తి నమోదైన చిత్రం కూడా పుష్ప 2 నే కావడం మరో విశేషం.

ABOUT THE AUTHOR

...view details