Horror Movies OTT:హారర్ సినిమా అంటే భయమేస్తుంది. అలా అని చూడటం మానేస్తామా? వెతుక్కుని మరీ చూస్తాం. ఏ థియేటర్కో వెళ్లి భయపడే కంటే ఎంచక్కా మీ ఇంట్లోనే ఉండి, మీ టీవీలోనే చూసి భయపడిపోతే ఎంత బాగుంటుంది. అదెలా అంటారా? ఓటీటీలు వచ్చాక ఏ కేటగిరీ సినిమాలైనా రిమోట్ దూరంలో కనిపిస్తున్నాయి.
కామెడీ, యాక్షన్, హారర్, రొమాంటిక్ ఎటువంటి కేటగిరీ కోసమైనా ఓటీటీల్లో వెదికేస్తుంటాం. అంతటి ఫుల్ ఎంటర్‌టైనింగ్ కంటెంట్‌తో ముస్తాబయిపోతున్నాయి ఓటీటీలు. మీరు కూడా ఓటీటీలతో ఎంజాయ్ చేస్తున్న వారైతే బెస్ట్ హారర్ సినిమాల కోసం అన్ని ఓటీటీలలో వెదకాల్సిన పని లేదు. మీ కోసం రెడీ చేసి ఉంచిన బెస్ట్ లిస్ట్ ఇక్కడ ఉంది. సినిమా పేరు, ఓటీటీ ప్లాట్ ఫాం పేర్లతో సహా ఉంది సరదాగా చూసి భయపడిపోండి మరి!
స్త్రీ
- నటీనటులు: శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు, పంకజ్ త్రిపాఠీ
- IMDB Rating: 7.5
- విడుదలైన సంవత్సరం: 2018
- కేటగిరీ: హారర్ - కామెడీ
- ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్
భూల్ భూలయ్యా
- నటీనటులు: అక్షయ్ కుమార్, విద్యా బాలన్, షైనీ అహుజా
- IMDB Rating: 7.4
- విడుదలైన సంవత్సరం: 2007
- కేటగిరీ: సైకలాజికల్ థ్రిల్లర్
- ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్
ముంజ్యా
- నటీనటులు: శర్వారీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్
- IMDB Rating: 7.2
- విడుదలైన సంవత్సరం: 2024
- కేటగిరీ: హారర్ కామెడీ
- ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్
రూహీ
- నటీనటులు: జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ
- IMDB Rating: 4.3
- విడుదలైన సంవత్సరం: 2021
- కేటగిరీ: హారర్ - కామెడీ
- ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భూల్ భూలయ్యా 2
- నటీనటులు: కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు
- IMDB Rating: 5.7
- విడుదలైన సంవత్సరం: 2022
- కేటగిరీ: హారర్ - కామెడీ
- ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్