GOD FATHER DIRECTOR MOVIE MEGALOPOLIS :ఓ సినిమా కోసం ఏడాది లేదా రెండు, మూడు సంవత్సరాల సమయం వెచ్చిస్తుంటారు దర్శకులు. టాలీవుడ్లో రాజమౌళి అలాంటి వారే. కానీ ఓ దర్శకుడు మాత్రం ఏకంగా తన చిత్రం కోసం ఏకంగా 47ఏళ్ల పాటు వెచ్చించారు. అవును ఆయన పేరే ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల. మెగలోపొలిస్ చిత్రం కోసం ఈ సమయాన్ని కేటాయించారాయన. ఇప్పుడీ చిత్రం ఈ ఏడాది విడుదల కాబోతుంది.
మెగాలోపొలిస్ చిత్రానికి దర్శకుడిగా, రైటర్‌గానే కాకుండా నిర్మాతగా వ్యవహరించారు ఫ్రాన్సిఫ్ ఫోర్డ్ కొప్పోల. ఈ చిత్రం కోసం దాదాపు రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారని తెలిసింది. ఫ్రాన్సిఫ్ మొదట ఈ సినిమాను 1977లో అనౌన్స్ చేశారు. 1983 నుంచి దీన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారట. ఈ కథ కోసం నికోలస్ కేజ్, లియోనార్డ్ డికాప్రియో, రసెల్ క్రో, రాబర్ట్ డీనిరో వంటి స్టార్ హీరోలను సంప్రదించారట. కానీ వర్కౌట్ కాలేదట. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వాయిదా పడుతూ ముందు కెళ్లిందట. నిర్మాతలు కూడా ముందుకు రాలేదని తెలిసింది.
దీంతో చేసేదేమి లేక చివరికి ఆడమ్ డ్రైవర్, ఎస్పోసిటో, అబ్రే ప్లాజాతో పాటు పలువురు హాలీవుడ్ నటులతో తన సొంత డబ్బును ఖర్చు చేసి సినిమా తీశారట. 2022లో షూటింగ్ మొదలుపెట్టారట ఫ్రాన్సిస్ ఫోర్డ్. 2024లో కంప్లీట్ చేశారు. మధ్యలో కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయట. ఎన్ని అడ్డంకులు ఎదురైన ఫ్రాన్సిస్ మాత్రం పట్టు వీడకుండా షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధం చేశారు. మొత్తంగా ఈ ప్రయాణంలో సినిమా కోసం వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేశారట. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాకుండా సినిమాను కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ కూడా చేశారు. ఈ స్క్రీనింగ్‌కు అహిరే రెస్సాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి త్వరలోనే ఈ ఏడాది రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది.