Holi Special Songs In Telugu Movies :హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. రంగులతో ఆడుకోవడం. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. జీవితం రంగులమయం కావాలని కాంక్షిస్తూ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ సందర్భంగా రంగులు చల్లుకోవడంలో ఉండే సంతోషం రెట్టింపు అవ్వాలంటే పాటలు తప్పకుండా కావాల్సిందే కదా. అయితే సినిమాల్లోనూ ఈ హోలీ కోసం ఎన్నో పాటలు వచ్చాయి. అభిమానుల చేత స్టెప్పులు వేయించాయి. మరీ ఆ సాంగ్స్ ఎంటో ఓ లుక్కేద్దామా
రాఖీ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానా, లీడ్ రోల్స్‌లో వచ్చిన రాఖీ సినిమాలోనూ ''రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్సే" అంటూ ఓ సాంగ్ వచ్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ ప్రతి హోలీ ఈవెంట్లో వినివిస్తూనే ఉంటుంది.
మాస్ : నాగార్జున లీడ్ రోల్లో వచ్చిన 'మాస్' మూవీలోనూ ''కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా'' అంటూ వచ్చిన సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
చక్రం :రెబల్‌స్టార్ ప్రభాస్, అసిన్, చార్మీ కాంబోలో రూపొందిన 'చక్రం' సినిమాలో "హోలీ రంగోలీ అందమా కేలీ.. ఎక్కడ నువ్వుంటే.." అంటూ ఓ హోలీ పాట వచ్చింది. 2005లో ఆ మూవీ విడులవ్వగా, అప్పట్లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అయ్యింది.
టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ హోలీపై పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.