తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమాలో రాసింది ఒక్క పాటే - కానీ లక్షల్లో రెమ్యూనరేషన్​ - అత్యథిక పారితోషకం అందుకుంటున్న లిరిసిస్ట్ ఎవరంటే? - Highest Paid Lyricist - HIGHEST PAID LYRICIST

Highest Paid Lyricist భారత సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం అందుకున్న గేయ రచయితల్లో బాలీవుడ్ లిరిసిస్ట్​ గుల్జార్‌ పేరు టాప్​లో ఉంటుంది. అయితే తాజాగా ఆయనకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుని ఓ స్టార్ గేయ రచయిత ట్రెండ్​లోకి వచ్చారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

Highest Paid Lyricist
Highest Paid Lyricist (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 12:56 PM IST

Highest Paid Lyricist :సినిమా పాటకు సంగీతం, సాహిత్యం రెండు కళ్లు లాంటివి. సంగీతం పాటను మనసుకు హత్తుకునేలా చేస్తే, సాహిత్యం మదిలో నిలిచిపోయేలా చేస్తుంది. భారతదేశంలో అద్భుతమైన పాటలు అందించిన గీత రచయితలు చాలా మందే ఉన్నారు. కానీ వీరిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది ఎవరో తెలుసా?

డుంకీ సినిమాకి భారీ పారితోషికం
ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గీత రచయిత జావేద్ అక్తర్. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఓ ప్రముఖ మీడియా వెబ్​సైట్ నివేదిక ప్రకారం, జావేద్‌ అక్తర్​ డుంకీ సినిమాకు గానూ ఓ పాట రాయడానికి ఏకంగా రూ.25 లక్షల పారితోషకాన్ని అందుకున్నారు. జావేద్‌ అక్తర్‌ కేవలం గీత రచయిత మాత్రమే కాదు, స్క్రీన్ రైటర్, కవిగానూ పాపులర్‌ అయ్యారు.

'ఒక్క పాట రాయడానికి ఇష్టపడను'
వాస్తవానికి జావేద్ అక్తర్ సినిమాలో కేవలం ఒక పాట రాయడం చాలా అరుదు. ఎందుకంటే ఆయన మూవీలోని అన్ని పాటలు రాయడానికి ఇష్టపడతారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఈవెంట్​లో వెల్లడించారు. 'నేను సాధారణంగా సినిమాలో ఒక్క పాట మాత్రమే రాయను. రాజ్​కుమార్ హిరాణీ 'డంకీ' సినిమా కోసం నన్ను ఒక్క పాటకు సాహిత్యం రాయమని అడిగారు. నేను మొదట నిరాకరించాను. కానీ ఆయన పట్టుబట్టి రాయమని కోరారు. నేను ఆయన అడగటం మానేస్తారనే ఉద్దేశంతో, చాలా కండీషన్స్ పెట్టాను. కానీ ఆయన అన్నింటికీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఓకే చెప్పారు అని జావెద్ అన్నారు.

డుంకీలో 'నిక్లే ది కభీ హమ్ ఘర్ సే' పాటకు లిరిక్స్​ రాసిన జావేద్ అక్తర్‌కి ప్రశంసలు దక్కాయి. డుంకీతో పాటు, 'ఖో గయే హమ్ కహాన్‌' అనే సినిమాకు కూడా ఆయన గేయ రచయితగా పని చేశారు. స్వానంద్ కిర్కిరే, ఇర్షాద్ కమిల్, అమితాబ్ భట్టాచార్య కూడా 'డుంకీ' కోసం పాటలు రాశారు.

అత్యధిక పారితోషికం పొందుతున్న ఇతర గేయ రచయితలు ఎవరంటే?
జావేద్ అక్తర్ లాగే గుల్జార్ కూడా సినిమాలో అన్ని జానర్స్​ పాటలు రాయడానికి ఇష్టపడతారు. ఓ ప్రముఖ మీడియా వెబ్​ గుల్జార్‌ ఒక పాటకు రూ.20 లక్షలు వసూలు చేస్తారట. ప్రసూన్ జోషి, విశాల్ దద్లానీ ఒక పాటకు రూ.10 లక్షలు చొప్పున తీసుకుంటారని సమాచారాం. వీరితో పాటు అత్యధిక పారితోషికం పొందే టాప్ 5 గీత రచయితల్లో ఇర్షాద్ కమిల్ (ఒక పాటకు రూ.8 లక్షలు), అమితాబ్ భట్టాచార్య (ఒక పాటకు రూ.7 లక్షలు) కూడా ఉన్నారట.

లిరిసిస్ట్​గా మారిన కమల్ హాసన్- 2గంటల్లోనే రికార్డింగ్ కూడా కంప్లీట్ - Kamal Haasan Thug Life

'ఆయన పాటలు మనుషులకు నేస్తాలు - అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్' - Nagarjuna About Sirivennela

ABOUT THE AUTHOR

...view details