Tamannaah Bhatiya and VijayVarma Wedding :ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. రీసెంట్గా మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, యంగ్ హీరో ఆశిష్ రెడ్డి సహా పలువురు తారలు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ల తర్వాత తమన్నా భాటియా, విజయ్ వర్మల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి రిలేషన్షిప్ గురించి ప్రకటించిన తర్వాత ఈ జంట పెళ్లి ఎప్పుడనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే గత కొంత కాలంగా లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న తమన్నా విజయ్ వర్మలు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.
వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో షోలు, ఈవెంట్లలోనూ పాల్గొన్నారు. మొదట్లో కొన్నాళ్లూ ఈ జంట మధ్య ప్రేమ గురించి దాచినా ఆ తర్వాత బహిరంగంగానే తాము ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం వీరిద్దరు కలిసి ఎన్నో ఫంక్షన్స్ లోనూ కనిపించారు. ప్రస్తుతం చట్టాపట్టాలేసుకని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రిలేషన్‌షిప్‌ను వివాహం వరకు తీసుకెళ్తున్నట్లు కూడా చెప్పారు.