Heroine Sreeleela Husband qualities : శ్రీలీల తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఈమె టాలీవుడ్ యంగ్ సెన్సేషన్. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనను తాను నిరూపించుకుంది. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ తన క్యూట్ యాక్టింగ్‌తో మనసు దోచింది. ముఖ్యంగా తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈ భామ తన భర్త ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.
వివరాల్లోకి వెళితే. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ శ్రీలీల. అయితే ఈ చిత్రం టాక్ పరంగా డివైడ్ రెస్పాన్స్‌ను అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించి ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మరిన్ని సినిమాలు చేస్తోంది. అలానే స్టార్ హీరోయిన్గా ఎదగడానికి తనకున్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది.
కాని గ్లామర్ అండ్ డ్యాన్స్ టాలెంట్ ఉన్నా ఈ భామకు అంతగా కలిసి రావట్లేదు. స్టోరీ సెలక్షన్స్‌లో తప్పటడుగు వేస్తోందనే వాదన వినిపిస్తోంది. దీంతో అన్ని వరుస పరాజయాలను అందుకుంటోంది. మొదట రామ్ పోతినేనితో స్కంద పర్వాలేదనిపించినా తర్వాత భగవంత్ కేసరితో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అనంతరం పంజా వైష్ణవ్‌తో ఆది కేశవ, నితిన్‌తో ఎక్స్ట్రార్డనరీ వంటి చిత్రాలు దెబ్బకొట్టాయి. దీంతో ఈ భామ కెరీర్ ఏం అవుతుందా అని ఆమెతో పాటు ఫ్యాన్స్ కూడా కాస్త ఆలోచిస్తున్నారు.