Heroines as Social Media Influencers : సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమలోని టాలెంట్‌ను బయట పెట్టుకోవడానికి ఇదో మంచి సాధనం. ముఖ్యంగా సినీ తారలకైతే ఇదో సూపర్ ప్లాట్‌ఫామ్. అయితే చాలా మంది హీరోయిన్లు కొంత కాలం రాణించిన తర్వాత ఛాన్స్‌లు లేక, సక్సెస్ రాక లేదంటే ఇతర పర్సనల్ కారణాల వల్ల తెరపైన కనపడరు. మరి కొందరు ఓ దశలో స్టార్ హీరోయిన్లుగా వెలిగి ఆ తర్వాత వయసుపైబడి మాయమైపోతారు. అయితే వీరంతా వెండితెరకు దూరమైనా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంటున్నారు. అలానే తమ ట్యాలెంట్‌ను ఈ వేదికగా మరోసారి నిరూపించుకుంటున్నారు. కంటెంట్ క్రియేటర్స్‌గా, సోషల్ స్టార్స్‌గా రాణిస్తూ లక్షల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, బ్యూటీ లేదా పలు సామాజిక అంశాలపై కంటెంట్ రూపొందిస్తూ తోటి మహిళల్లోనూ స్ఫూర్తిని నింపుతున్నారు. అలా ఓ దశలో సిల్వర్ స్క్రీన్‌పై టాప్ స్టార్‌గా రాణించి ఇప్పుడు డిజిటల్ స్టార్స్‌గా మారిన పలువురు ముద్దుగుమ్మల గురించే ఈ కథనం.
శిల్పాశెట్టి(Shilpa Shetty Social Media) - వయసు పెరుగుతున్నా తరిగిపోని అందం, ఫిట్‌నెస్ ఈమెది. సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఈమె అందం, ఫిట్‌నెస్ రహస్యాలను కంటెంట్‌గా క్రియేట్ చేసి తన ఫాలోవర్స్‌కు అందించడం ప్రారంభించింది. వీటిపై మొదట ఓ డీవీడీని రిలీజ్ చేసిన ఆమె ఆ తర్వాత పుస్తకాలు కూడా రాసింది. అనంతరం ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి దూసుకెళ్లింది. ఎన్నో ఆరోగ్యకరమైన వంటకాల్ని పోస్ట్ చేస్తుంటుంది. అలానే తాను వెళ్లే పర్యాటక ప్రదేశాల గురించి పోస్ట్ చేస్తుంది. ఫ్యాషన్ పాఠాలను నేర్పుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమెకు 3.2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ ఛానల్‌కు 36 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
సమీరా రెడ్డి(Sameera Reddy Social Media) - ఈ ముద్దుగుమ్మ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకెదురైన మంచి, చెడు అనుభవాల్ని పంచుకుంటుంటుంది. బాడీ షేమింగ్, బ్యూటీ షేమింగ్ వంటి వాటిపై కూడా అవగాహన కల్పిస్తోంది. పేరెంటింగ్ పాఠాలు చెబుతోంది. సరదా వీడియోలు కూడా చేస్తుంది. మహిళా ప్రాధాన్య సమస్యల పై కూడా మాట్లాడుతుంటుంది.
ఓ సందర్భంలో సోషల్ మీడియా గురించి సమీర్ మాట్లాడుతూ తనకు ఈ ప్లాట్‌ఫామ్ ఉన్నతమైన హోదాను తెచ్చిపెట్టిందని చెప్పింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అవకాశాలు, అందం విషయంలో ఎన్నో భయాలు తనకు ఉండేవని, కానీ ఆ భయాలను తాను అధిగమించినట్లు చెప్పుకొచ్చింది. ఈ పాజిటివిటీనే తోటి మహిళల్లో నింపడానికి, తాను సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు తెలిపింది. అందుకే తాను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మారినట్లు చెప్పుకొచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాలో 17.8 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
షెహ్నాజ్ ట్రెజరీ(Shenaz Treasury) - 'ఇష్క్ విష్క్', 'దిల్లీ బెల్లీ' వంటి చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యుూటీ 'వన్ లైఫ్ టు లివ్' అనే అమెరికన్ టీవీ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.