Game Changer Teaser : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఇది రెడీ అయింది.
భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం శనివారం గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల చేసింది. ప్రభుత్వ అధికారి పాత్రలో రామ్‌చరణ్ నటన, పవర్‌ఫుల్ సంభాషణలు అదిరిపోయాయి. తమన్ అందించిన మ్యూజిక్ టీజర్‌ను మరింత ఎలివేట్ చేసింది.
సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాలేజీ స్టూడింట్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్‌గా మారిన రామ్ చరణ్ విలన్‌లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథగా చూపించనున్నట్లు అర్థమవుతోంది. మరో పాత్రలో చరణ్ రైతు నాయకుడిగా కనిపించనున్నారు. మొత్తంగా ఈ సినిమా టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో పవర్‌ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో అభిమానులు మస్త్ థ్రిల్ అవుతున్నారు.
ప్రచార చిత్రం ఎలా సాగిందంటే? - మొదటగా హెవీ క్రౌడ్, స్లో బిజిఎమ్‌తో ప్రచార చిత్రాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాతా, బేసిక్‌గా రామ్ అంత మంచోడు ఇంకోకడు లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంతా చెడ్డొడు ఇంకోడు ఉండడు అనే డైలాగ్‌తో రామ్ చరణ్ ఎంట్రీని చూపించారు. ఆ తర్వాత కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ఫైట్ సీన్స్ చూపిస్తూనే పాటూ రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ గెటప్‌ను కూడా చూపించారు.
ఆ తర్వాత సీనియర్ పొలిటీషయన్ పాత్రలో శ్రీకాంత్, సముద్రఖని, ఎస్ జె సూర్య, జయరామ్ తదితరులు కనిపించారు. ఫైనల్‌గా రామ్ చరణ్ ఐయామ్ అన్ ప్రిడిక్టబుల్ అంటూ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. ఇకపోతే ఈ టీజర్లో హీరోయిన్ కియారా అద్వానీకి పెద్దగా డైలాగులు లేవు. తమన్ మాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది.
ఈ వారం OTTలో బోలెడన్నీ సినిమా/సిరీస్‌లు - ఆ 5పై స్పెషల్ ఫోకస్
'యానిమల్ పార్క్‌ను అప్పుడే షురూ చేస్తాం - రిలీజ్ ఆ ఏడాదిలో' : నిర్మాత భూషణ్ కుమార్