Heroine Samantha Age : ఏంటి టైటిల్ చూసి షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే తెగ ట్రెండ్ అవుతోంది. అంతా దీని గురింటే మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే. హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు తనకు సంబంధించిన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఈ భామ నాగచైతన్యతో విడిపోయాక కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టి స్టార్ నటిగా ఎదిగింది. కానీ గతేడాది మాత్రం మయోసైటిస్ బారిన పడి అభిమానులను ఆందోళనకు గురి చేసింది.
13 ఏళ్లు వెనక్కి వెళ్లిన సామ్ - ఇప్పుడంతా సామ్ వయసు గురించే చర్చ! - సమంత ఫిట్నెస్ వర్కౌట్స్
Heroine Samantha Age : సమంత వయసు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ఆమె వయసు 23 ఏళ్లు అని అంటున్నారు. అసలేం జరిగిందో తెలుసుకుందాం.
Published : Feb 22, 2024, 2:19 PM IST
దీంతో ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి సారించేందుకు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తన వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని గడిపింది. స్క్రీన్కు మాత్రమే దూరమైంది కానీ నెట్టింట్లో మాత్రం ఎప్పుడూ టచ్‌లో ఉంది. తాను చేసిన ప్రతి పని గురించి ఎప్పటికప్పుడు షేర్ చేసింది.
రీసెంట్గా తనలా ఎవరూ రోగాల బారిన పడకూడదని టేక్ 20 అనే హెల్త్ పాడ్ కాస్ట్‌ను ప్రారంభించి మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. అలాగే సామ్ ఎప్పుడు ఫిట్‌నెస్‌కు కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తన వర్కౌట్‌కు సంబంధించిన ఫొటోస్ను షేర్ చేసింది. తన చుట్టూ ఉన్న అందమైన లొకేషన్లను చూపించింది. ఇంకా ఈ పోస్ట్‌లో తన ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్ గురించి కూడా ఉంది. అందులో సామ్ మెటబాలిక్ ఏజ్ కూడా రాసి ఉంది. తన వయసు కేవలం 23 ఏళ్ళు అని అందులో కనిపించింది. అలానే తన బరువు 50 కేజీలు, ఫ్యాట్, బోన్స్, BMR ఇలా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అలా వైరలవుతున్న సామ్ మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్ళే అని చూసిన నెటిజన్లు అభిమానులు షాక్ అండ్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఇకపోతే ఆ మధ్య సామ్ చివరిసారిగా ఖుషి సినిమాతో బాక్సాఫీస్ ముందు హిట్ అందుకుంది. త్వరలోనే ఇండియన్ వెర్షన్ సిటాడెల్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.