తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఉపేంద్ర 'యూఐ'పై యశ్​, కిచ్చా సుదీప్ కామెంట్స్​ - UPENDRA UI MOVIE

ఉపేంద్ర నటించిన 'యూఐ'పై పోస్ట్​లు పెట్టిన హీరోలు యశ్‌, కిచ్చా సుదీప్‌ - ఏమని పెట్టారంటే?

Upendra UI
Upendra UI (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2024, 9:24 AM IST

Upendra UI : పాన్ ఇండియా సినిమా అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కానీ, 90 ద‌శ‌కంలోనే ఆ ట్రెండ్‌ను రుచి చూపించి, దేశ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ఆల్‌రౌండ‌ర్ స్టార్ ఉపేంద్ర‌. క‌థానాయ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌కు ప్ర‌త్యేకమైన అభిమానులు ఉన్నారు. 'A', 'ఉపేంద్ర‌', 'రా', 'ష్‌' త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. తెలుగులోనూ ప‌లు చిత్రాలు చేశారు. అయితే ప‌దేళ్ల విరామం త‌ర్వాత ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం 'UI'. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది.

రీసెంట్​గా రిలీజైన ఈ 'యూఐ' సినిమా పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై ఇతర హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడ హీరో యశ్‌ ఈ చిత్రాన్ని చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఉపేంద్రతో కలిసి ఈ చిత్రాన్ని చూసిన రాకింగ్ స్టార్​, ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు తెలిపారు.

ఈ సినిమా (UI) కోసం ఉపేంద్ర సర్‌ నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయన ఎంచుకునే కథలు ఎంతో విలక్షణంగా ఉంటాయని, ప్రస్తుతం మరోసారి రుజువైంది. నాతో పాటు ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి రావడానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. యూఐ చిత్రం ప్రేక్షకులను లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఆయన కేవలం వినోదం కోసమే సినిమాలు చేయరు. అనేక సమస్యల గురించి తన చిత్రంలో మాట్లాడతారు. ఇందులో విజువల్స్‌ ఎంతో బాగున్నాయి. దీని కోసం పని చేసిన నటీ నటులతో పాటు సాంకేతిక నిపుణులకు అభినందనలు" అని అన్నారు.

ఈ చిత్రం చూసిన హీరో కిచ్చా సుదీప్‌ కూడా ఎక్స్‌ వేదికగా మాట్లాడారు. "ఇంత గొప్ప ఆలోచనను ముందుకు తీసుకువెళ్లిన మూవీ టీమ్​కు ప్రత్యేక అభినందనలు. ఈ చిత్రానికి వస్తోన్న ప్రేక్షకాదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు"అని పేర్కొన్నారు. మూడు సార్లు గ్రామీ అవార్డు తీసుకున్న సంగీత దర్శకుడు రికీ కేజ్‌ కూడా ఎక్స్‌ వేదికగా స్పందించారు. "ఇది అద్భుతమైన చిత్రమని, ఇలాంటివి మంచి విజయాన్ని సాధించాలి. అలరిస్తూనే ఆలోచింపజేస్తుంది. అందరూ తప్పక చూడాలి." అని చెప్పుకొచ్చారు.

ఒక్క సినిమా కోసం 5 లక్షల మంది నిర్మాతలు - హైదరాబాదీ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ సినీ జర్నీ విశేషాలివే

'డాకు మహారాజ్‌' - మనసును హత్తుకునేలా 'చిన్నీ' సాంగ్​

ABOUT THE AUTHOR

...view details