తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

థియేటర్లలో డబుల్ మ్యాడ్‌నెస్​ సెలబ్రేషన్స్ పక్కా: హీరో రామ్ - Double Ismart - DOUBLE ISMART

Double Ismart: హీరో రామ్‌ పోతినేని- డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా 'డబుల్‌ ఇస్మార్ట్‌'. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం రిలీజైంది. ఈ సందర్భంగా హీరో రామ్ ఈ సినిమా గురించి మాట్లాడారు.

Double Ismart
Double Ismart (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 9:52 AM IST

Double Ismart:స్టార్ హీరో రామ్‌ పోతినేని- డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబోలో తెరకెక్కిన సినిమా 'డబుల్‌ ఇస్మార్ట్‌'. ఈ సినిమాలో రామ్​కు జోడీగా కావ్యా థాపర్ నటించింది. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖ పట్టణంలో గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​కు రామ్, హీరోయిన్​ కావ్యా సహా తదితరులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రామ్ మాడ్లాడారు.

'డబుల్ ఇస్మార్ట్' కమర్షియల్ సినిమా అని, థియేటర్లలో డబుల్ మాస్ మ్యాడ్‌నెస్​తో సంబరాలు చేసుకునేలా ఉంటుందని అన్నారు. 'ఇప్పటి వరకు పూరి జగన్నాథ్‌ చేసిన సినిమాలన్నింటి కంటే ఎక్కువ టైమ్‌ తీసుకుని చేసిన చిత్రమిది. కమర్షియల్‌ సినిమా హిట్టయితే దాంట్లో వచ్చే కిక్కే వేరు. అది 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో అప్పుడు చూశాను. మళ్లీ 'డబుల్‌ ఇస్మార్ట్‌'తో ఆ కిక్‌ ఉంటుందని ఆశిస్తున్నాను' హీరో రామ్ అన్నారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే, 'తలకి USB పోర్ట్‌ పెట్టుకుని తిరుగుతున్న ఒకే ఒక్క ఇడియట్‌' అంటూ ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌గా రామ్‌ పాత్రను ట్రైలర్‌లో ఆసక్తికరంగా పరిచయం చేశారు. దాదాపు రెండున్నర నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం మాస్‌ యాక్షన్‌ హంగామానే కనిపించింది. బాలీవుడ్ స్టార్ నటులు సంజయ్‌ దత్‌ ఇందులో బిగ్‌బుల్‌ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన మెదడులోని జ్ఞాపకాల్ని ఇస్మార్ట్‌ శంకర్‌ మెదడులోకి ప్రవేశ పెడితే ఏం జరిగిందన్నద జానర్​లో ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఇక హీరోయిన్ కావ్యకు రామ్​కు మధ్య నడిచే లవ్‌ట్రాక్‌ వాళ్లిద్దరి కెమిస్ట్రీ అలరించింది. కమెడియన్ అలీ గెటప్​లో కూడా పూరి మార్క్ కనిపించింది.

కాగా, ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్​వైడ్​గా రిలీజ్ కానుంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. పూరి కాన్సెప్ట్స్​ బ్యానర్​పై నటి చార్మి సినిమాను నిర్మించారు. ఛాయాగ్రహణం బాధ్యతలు సామ్‌ కె.నాయుడు, జియాని జియాన్నెలి చూసుకున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

'డబుల్ ఇస్మార్ట్'- మాస్ ట్రైలర్​ లోడింగ్- ఈవెంట్ ఎక్కడంటే?

హిందీలో రామ్ ​పోతినేని సినిమా సెన్సేషన్

ABOUT THE AUTHOR

...view details