Hero Prabhas Car Collection :ప్రభాస్ - ఈ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగ. ఈ టాలీవుడ్ రెబల్‌స్టార్, బాహుబలి తర్వాత మోస్ట్ పాపులర్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తన నటనా చాతుర్యంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
పెద్దనాన్న కృష్ణంరాజు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన నటనతో అభిమానులను ఉర్రూతలూగించారు. భారీ హిట్టులను అందుకున్నారు. ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు. కనుక ఆయనకు చిన్నప్పటి నుంచే కార్లు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. అందుకే ఆయన కార్ కలెక్షన్లో సూపర్ లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై మనమూ ఓ లుక్కేద్దాం రండి.
ప్రభాస్ కార్ కలెక్షన్ చూస్తే మతి పోతుంది!
ప్రభాస్ గ్యారేజ్‌లో ఇప్పటికే BMW X3 (రూ.56 లక్షలు), జాగ్వర్ XJL 3.0 (రూ.1.97 కోట్లు), రేంజ్ రోవర్ SV ఆటోబయోగ్రఫీ (రూ.1.84 కోట్లు), లంబోర్గిని అవెంటడార్ రోడ్‌స్టర్ (రూ.6 కోట్లు) లాంటి ఖరీదైన, ఫారెన్ బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ప్రభాస్ కలెక్షన్లో ఉన్న చిన్నచిన్న కార్లు మాత్రమే. వీటిని తలదన్నే అత్యంత ఖరీదైన కారు కూడా ఉంది. అది ఏంటంటే?
ప్రభాస్ కలెక్షన్లలో అత్యంత ఖరీదైన కారు రూ.8 కోట్లు విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉంది. దీని కోసం ప్రభాస్ ఏకంగా రూ.2.5 కోట్లు అదనంగా ఖర్చు చేసి, కస్టమైజేషన్ కూడా చేశారు. అంటే ప్రభాస్ సినిమాల్లోనే కాదు, కార్ల కలెక్షన్ల్లోనూ బాహుబలే అని స్పష్టమవుతోంది. ప్రభాస్ గ్యారేజీలోని ఈ ఫ్యాన్సీ కార్లు గురించి మరింత వివరంగా ఇప్పుడు చూద్దాం.
1. Rolls Royce Phantom :ప్రపంచంలోని అత్యంత లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఒకటి. ఈ కారు ధర సుమారుగా రూ.8-9 కోట్లు ఉంటుంది. ప్రభాస్‌తో పాటుగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ నటుల దగ్గర ఈ కారు ఉంది.
2. Audi R8 :ఈ సూపర్ లగ్జరీఆడి R8 కారు ధర రూ.2.30 కోట్లు ఉంటుంది.
3. Jaguar XJL : ప్రభాస్ అత్యంత ఇష్టమైన కార్లలోసిల్వర్ జాగ్వర్ XJL ఒకటి. ఇది ప్రభాస్ హృదయంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్‌డమ్ సాధించిన తర్వాత కొనుగోలు చేసిన మొదటి లగ్జరీ కారు ఇదే. దీని ధర రూ.1.97 కోట్లు ఉంటుంది.
4. BMW X5 :ప్రభాస్ దగ్గర బ్లాక్ బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 కారు ఉంది. ఈ సెకండ్ జనరేషన్ మోడల్ ఫేస్‌లిఫ్ట్ 3.0-లీటర్ స్ట్రెయిట్-సిక్స్ డీజిల్ ఇంజన్, 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఇది 255 PS పవర్, 560 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ధర సుమారుగా రూ.1.2 కోట్లకు పైగానే ఉంటుంది.
5. Range Rover SV Autobiography :'SV' అంటే ల్యాండ్ రోవర్ గ్రూప్ నుంచి వచ్చిన ఒక 'స్పెషల్ ఎడిషన్ వెహికల్' అని అర్థం. రేంజ్ రోవర్ స్పోర్ట్ SV ఎడిషన్ 1 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 626 bhp పవర్, 800 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కేవలం 3.8 సెకన్లలోనే 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్ఠంగా గంటకు 290 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తుంది. దీని స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ధర రూ.6 కోట్లకు పైగానే ఉంటుంది.
6. Lamborghini Aventador Roadster :లంబోర్గినీ అవెంటడోర్ రోడ్‌స్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిషన్‌తో వస్తుంది. దీని మైలేజ్ 5.0 kmpl. ఈ పెట్రోల్ కారులో 90 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఇది ఒక కన్వర్టిబుల్ కారు. గ్రౌండ్ క్లియరెన్స్ 125 మిమీ. ఈ కారు ఇంజిన్ 12 సిలిండర్లతో వస్తుంది. ఇది 5500 rpm వద్ద 690Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిపై గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. ఈ కారులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్, పవర్ విండోస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
అందరికీ నచ్చే డార్లింగ్!
అభిమానులు ప్రభాస్‌ను "డార్లింగ్" అని పిలుచుకుంటారు. తెలుగు ఇండస్ట్రీలో ఆయన్ను రెబల్‌స్టార్‌గా గుర్తిస్తారు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ "పాన్-ఇండియా స్టార్"గా ఎదిగారు. టైమ్స్ మ్యాగజీన్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2017, 2018 ఎడిషన్‌లలో, ఆయన వరుసగా రెండవ, పన్నెండవ స్థానాల్లో నిలిచారు. 2019లో, హైదరాబాద్ టైమ్స్ ప్రభాస్‌ను ఫరెవర్ డిజైరబుల్ లిస్టులో చేర్చింది. 2019లో కర్ణాటకలో అత్యధికంగా ప్రభాస్ గురించే గూగుల్‌లో సెర్చ్ చేశారు. అదే విధంగా 2021లో "మోస్ట్ సెక్సీయెస్ట్ ఏషియన్ మ్యాన్"గా ప్రభాస్ ఎంపికయ్యారు.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్-10 కార్లు ఇవే!
మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలా? ఈ టాప్-9 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!