తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గతం గతః- నిన్న జరిగింది మర్చిపోవాలి'- మోహన్ బాబు - MOHAN BABU LATEST

సంక్రాంతి సంబరాల్లో నటుడు మోహన్ బాబు- తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు చెప్పిన హీరో

Mohan babu
Mohan babu (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 5:14 PM IST

Mohan Babu Latest :హీరో మోహన్ బాబు తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన హీరోగా నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని ఓ డైలాగ్​తో ఆకట్టుకున్నారు. నిన్న జరిగింది మర్చిపోవాలి, నేడు ఏం చేయాలా? అని ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని మోహన్ బాబు యూనివర్సిటీలో పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన పండగ శుభాకాంక్షలు చెప్పారు.

'రాయలసీమ రామన్న చౌదరిలో ఓ డైలాగ్ చెప్పాను. నిన్న జరిగింది మర్చిపోవాలి, నేడు జరగాల్సింది వాయిదా వేయను. రేపటి గురించి ఆలోచించను. గతం గతః నిన్న జరిగింది మర్చిపోవాలి.. నేడు ఏం చేయాలా? అని ఆలోచించాలి. రేపు దీనికంటే గొప్పగా ఏం చేయాలో ఆలోచించాలి. మన సినిమా విజయం సాధిస్తే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే ఇది మన వృత్తి. సంక్రాంతి అంటే రైతు. రైతు బాగుంటేనే మనంందరం బాగుంటాం. ఇది మనందరి పండుగ. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’ అని మోహన్‌బాబు తెలిపారు. ఇక వేడుకల్లో భాగంగా విద్యార్థులతో కలిసి ఆయన పలు కార్యక్రమాల్లోనూ హుషారుగా పాల్గొన్నారు.

కన్నప్ప గురించి
కాగా, ఇదే ఈవెంట్​లో కన్నప్ప గురించి కూడా ఆయన మాట్లాడారు. 'గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్నాయి. ఊహించని రీతిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం. ఖర్చు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువగానే ఖర్చుపెట్టాం. సినిమాపై మేం చాలా నమ్మకంగా ఉన్నాం. శ్రీ కాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం అందుకున్నాయి. పరమేశ్వరుడు ఆదుకుంటారు'

'ఆయన వరంతో నేను పుట్టాను. నా పేరు భక్తవత్సలం. సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ ఎప్పుడూ సర్వ సాధారణం. కానీ, ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రజలు, అభిమానుల ఆశీస్సులు కావాలి' అని మోహన్ బాబు పేర్కొన్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్​గా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్, కాజల్, మోహన్​ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు. 2025 ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది.

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్‌ డేట్ ఫిక్స్​

'కన్నప్ప' టీజర్ ఔట్- ప్రభాస్ ఎంట్రీ అదుర్స్- వీడియో చూశారా? - Kannappa Teaser

ABOUT THE AUTHOR

...view details