Happy Birthday Trisha interesting facts :కొందరు హీరోయిన్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోతుంటారు. అందం ఉన్నా, ఎంత గొప్పగా నటించినా, ఎన్ని విజయాలు దక్కించుకున్నా కొంత కాలానికి మాయమైపోతుంటారు. కానీ ఆమె మాత్రం అలా కాదు. రెండు దశాబ్దాలైన ఇంకా రాణిస్తూనే ఉంది. ఇప్పటికీ అందం కూడా ఆమెను చూసి అసూయ పడాల్సిందే. తనే త్రిష. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు మీరు ఇప్పటివరకు వినని విషయాలను తెలుసుకుందాం.
ఆలోచన మార్చుకుని - 1983 మే 4న చెన్నైలో కృష్ణన్, ఉమ దంపతులకు జన్మించింది త్రిష. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదివింది. మోడలింగ్‌పై ఉన్న ఆసక్తితో కెరీర్ ప్రారంభించింది. 1999లో మిస్ చెన్నై కిరీటం దక్కించుకుంది. 2001లో మిస్ ఇండియా బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ కూడా అందుకుంది. చిన్నతనంలో సైకాలజిస్టు అవ్వాలనుకున్న ఆమె ఆ తర్వాత ఆలోచన మార్చుకుని యాక్టింగ్ వైపు వచ్చింది. అలా మొదటగా ఓ ఆల్బమ్‌లో కనిపించి సినిమా అవకాశాలు అందుకుంది.
అలా అరంగేట్రం - సిమ్రన్ జోడి చిత్రంతో తెరంగ్రేటం చేసిన త్రిష ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్ వర్షం ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, అల్లరి బుల్లోడు, పౌర్ణమి, సైనికుడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ, బుజ్జిగాడు సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అనంతరం కొంత కాలం తెలుగు సినిమాలకు దూరమైన ఈమె రీఎంట్రీలో పొన్నియిన్ సెల్వన్‌తో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. అదే అందంతో కుర్రాళ్లను మాయ చేసేసింది. రోడ్, లియో, రాంగి వంటి చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయి. వీటిలో చిరంజీవి విశ్వంభర కూడా ఉండటం విశేషం.
ప్రేమ పెళ్లి - ప్రొఫెషనల్ లైఫ్‌లో సక్సెస్ అయిన ఈమె పర్సనల్ లైఫ్‌లో పెళ్లి చేసుకోలేదు. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయ్యాక అది క్యాన్సిల్ అయింది. అఫైర్స్ అంటూ ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఎప్పటికైనా ప్రేమ వివాహానికే తన ఓటు అని చాలా సార్లు చెప్పింది త్రిష.
మరి కొన్ని విషయాలు త్రిష గురించి
త్రిషకి వాళ్ల అమ్మే స్ఫూర్తి.
ఫోన్‌కు బాగా ఎడిక్ట్. ఖాళీ సమయం దొరికితే చాలు ఫోన్ చూస్తూనే ఉంటుందట. కాల్స్ ఎక్కువగా మాట్లాడదు కానీ సందేశాలు పంపించేందుకు, ఆటలు ఆడేందుకు, తాజా వార్తలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుందట. వెంకటేశ్, ప్రకాశ్ రాజ్ ఫోన్ పిచ్చి అంటూ ఏడిపిస్తారట.
ముద్దు పేర్లు : ట్రాష్, ట్రిష్, హనీ
ఖాళీ సమయంలో : స్నేహితులతో ముచ్చట్లు, వీధుల్లో షికార్లు, విదేశీ ప్రయాణాలు