Hanuman OTT:2024లో తొలి బ్లాక్‌బస్టర్ మూవీ హను-మాన్ ఓటీటీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇప్పుటికే పలుమార్లు వాయిదా పడింది. హనుమాన్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న జీ5 స్ట్రీమింగ్ డేట్‌పై క్లాటిరీ ఇవ్వట్లేదు. మరోవైపు హిందీలో ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్‌కు రెడీ అవుతోంది. మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ ఛానల్, జియో సినిమాలో టెలికాస్ట్ కానుంది.
అయితే అదే రోజు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని ఆడియెన్స్ ఆశిస్తున్నప్పటికీ, దీనిపై సరైన క్లారిటీ లేదు. దీంతో హనుమాన్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ చేయాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు రిక్వెస్ట్ పెడుతున్నారు. ఫన్నీ ఫన్నీ మీమ్స్, పోస్ట్‌లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికైనా సస్పెన్స్ వీడి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇవ్వాలంటూ జీ5ని ట్యాగ్ చేస్తున్నారు. చూడాలి మరి మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో ఉన్న హనుమాన్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో?
చిన్న సినిమాగా రూపొంది 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ అతి పెద్ద విజయం సాధించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్లోనూ కాసుల వర్షం కురిపించిన హనుమాన్ రూ.300+ కోట్లు వసూల్ చేసింది. ఇక ఈ సినిమా రీసెంట్గా 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ నటించగా, వరలక్ష్మి శరత్కుమార, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు ఆయా పాత్రలు పోషించారు.