తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హనుమాన్' సునామీ- 92 ఏళ్లలో ఆల్​టైమ్​ బ్లాక్​బస్టర్​గా రికార్డ్! - Hanuman Movie Overseas Collection

Hanuman Movie All Time Record: తేజ సజ్జా- ప్రశాంత్ వర్మ విజువల్ వండర్స్ మూవీ హనుమాన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుగొడుతోంది. వరల్డ్​వైడ్​గా ఇప్పటికే రూ.250+ కోట్ల వసూళ్లు సాధించిన ఈ మూవీ తాజాగా మరో రికార్డు కొట్టింది.

Hanuman Movie All Time Record
Hanuman Movie All Time Record

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 3:25 PM IST

Updated : Feb 2, 2024, 4:08 PM IST

Hanuman Movie All Time Record:2024 సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా నిలిచి ఘన విజయం సాధించింది 'హనుమాన్'. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గ్రాఫిక్స్​తో క్రియేట్ చేసిన అద్భుతానికి థియేటర్లలో రెస్పాన్స్​ అదిరిపోయింది. జనవరి 12న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద హౌస్​ఫుల్ షోస్​ తో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రికార్డులు బద్దలయ్యాయి. వరల్డ్​వైడ్​గా ఈ మూవీ రూ.250 కోట్ల మార్క్ దాటేసింది. అటు ఓవర్సీస్​లోనూ 5+ మిలియన్ డాలర్లు వసూల్ చేసిన టాప్- 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక హనుమాన్ తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. అదేంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ హీరోలందరి సెంటిమెంట్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పెద్ద పండగ కావడం వల్ల అందరు హీరోలు తమ సినిమాలు అప్పుడే రిలీజ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో అనేక సంవత్సరాలుగా సంక్రాతికి పలువురు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి. అయితే 2024 సంక్రాంతికి కూడా పలు సినిమాలు రిలీజయ్యాయి. అందులో యంగ్ హీరో తేజ సజ్జ సినిమా హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకొని పలు రికార్డులు బద్దలుగొడుతోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ 92 ఏళ్ల తెలుగు సినిమా హిస్టరీలో 'ఆల్​ టైమ్ సంక్రాంతి బ్లాక్​బస్టర్'​గా చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ అధికారికంగా ట్విట్టర్​లో షేర్​ చేసింది.

Hanuman Movie Cast: హనుమాన్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జతోపాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందించారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక 2025లో జై హనుమాన్ టైటిల్​తో ఈ సినిమా సీక్వెల్ రానుంది.

'హనుమాన్' సక్సెస్​ - ఆ స్టార్ హీరోతో వరలక్ష్మీ శరత్​కుమార్ పెళ్లి!

PVCUలో రవితేజతో సినిమా ప్లాన్- హనుమాన్ డైరెక్టర్ క్రేజీ అప్డేట్

Last Updated : Feb 2, 2024, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details