Prabhas Fauji Movie Shooting Update : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పలు చిత్రాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం కూడా ఒకటి. 'ఫౌజీ' పేరుతో ఇది తెరకెక్కుతోంది. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 1940 వార్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ ఇమాన్వీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మతో కలిసి ప్రభాస్‌పై దర్శకుడు కొన్ని బ్యూటీఫుల్ సీన్స్‌ను తెరకెక్కించినట్టుగా బయట కథనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసేశారట. వీటిలో మెయిన్ లీడ్‌పై తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. మొత్తంగా ప్రస్తుతానికైతే ప్లానింగ్ ప్రకారం షూట్ నిర్విరామంగా జరిగిపోతున్నట్టుగా సమచారం అందుతోంది. మరి వీటిలో నిజమెంతో తెలీదు గానీ ప్రస్తుతానికి ఈ వార్తైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ భారీ బడ్జెట్ ఫౌజీ చిత్రం నిర్మితం అవుతోంది. రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించుకుంది. విభిన్నమైన కథతో ఇది తెరకెక్కుతున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే పాటలు కూడా కంపోజ్ చేశారు.