Good Night Movie Heroine Meetha Raghunath Marriage :ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. అలా తాజాగా తమిళ యంగ్ హీరోయిన్ మీతా రఘునాథ్ సైలెంట్‌గా పెళ్లి చేసుకుని తన ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. తన పేరెంట్స్ చూసిన అబ్బాయితో ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహాం ఇరు కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో మీతా రఘునాథ్‌కు నెటిజన్లు, ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కొంతమంది కుర్రాళ్లైతే తెగ ఫీలైపోతున్నారు.
కాగా, 2002లో ముదల్ ముదివమ్ నీ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీతా యాక్ట్ చేసినవి కొన్ని సినిమాలే అయినా తన నేచురల్ నటనతో అందర్నీ ఆకట్టుకుంది. ఇటీవలే ఆమె నటించిన గుడ్ నైట్ సినిమాను భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. గతేడాది వచ్చిన ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. మిలియన్ డాలర్ స్డూడియోస్, ఎమ్మార్పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లపై వచ్చిన ఈ మూవీలో కె.మణికంఠన్, మీతా రఘునాథ్ జోడీ అందర్నీ మెప్పించింది. ఈ సినిమా సౌతిండియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో మీతా రఘునాథ్ తన సహజ నటనతో ప్రేక్షకులను తన మాయలో పడేసింది.