తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్​చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్- షూటింగ్ ఎప్పుడంటే? - Ram Charan Prashanth Neel Movie - RAM CHARAN PRASHANTH NEEL MOVIE

Ram Charan Prashanth Neel Movie : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

Ram Charan Prashanth Neel Movie
Ram Charan Prashanth Neel Movie (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2024, 7:18 AM IST

Ram Charan Prashanth Neel Movie :గ్లోబల్ స్టార్ రామ్​చరణ్ ప్రస్తుతం శంకర్ 'గేమ్​ఛేంజర్' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్​లో ఉంది. తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేయనున్నారు. దీని తర్వాత సుకుమార్​తో ఓ సినిమా ఓకే చేశారు. ఇలా వరుస సినిమాలు లైన్​లో పెట్టిన రామ్​చరణ్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్​ నీల్​తో జత కట్టనున్నారని ఇన్​సైట్ టాక్ వినిపిస్తోంది.

రామ్​చరణ్- ప్రశాంత్ నీల్ కాంబో దాదాపు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. దీనిపై చర్చలు కూడా పూర్తయ్యాయట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య రూపొందించనున్నారని సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ చేతిలో వరుసగా 'ఎన్టీఆర్ 31', 'సలార్ 2', 'కేజీఎఫ్ 3' సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు పూర్తైన తర్వాత రామ్​చరణ్​ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిసింది. అంతలోపు బుచ్చిబాబు, సుకుమార్​ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉండనున్నారు రామ్​చరణ్. కాగా, ఈ వార్త మెగా ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ నింపుతోంది.

గేమ్​ఛేంజర్ అప్డేట్

రామ్​చరణ్ 'గేమ్​ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పాన్​ఇండియా లెవెల్​లో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా 2024 డిసెంబర్​లో రానున్నట్లు మేకర్స్​ కొద్ది రోజులుగా చెబుతున్నా, డేట్ వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో మేకర్స్​ రెండు తేదీలు ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 20న లేదా క్రిస్మస్‌ సందర్భంగా 25న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు యస్​జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటులు శ్రీకాంత్, అంజలీ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్​చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారని టాక్.

'గేమ్​ ఛేంజర్‌' టీజర్‌పై తమన్‌ పోస్ట్‌ - ఏంటంటే?

RC16 షూటింగ్ అప్డేట్​ - ఆ రోజు నుంచే ప్రారంభం! - RC 16 Movie Shooting Update

ABOUT THE AUTHOR

...view details