NTR Prashanth Neel Movie:గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'ఎన్టీఆర్ 31' (వర్కింగ్ టైటిల్). ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే సోమవారం (మే 20) ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మూవీ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా షూటింగ్ 2024 ఆగస్టులో ప్రారంభం కానున్నట్లు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీమేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ '2024 ఆగస్టులో షూటింగ్ ప్రారంభమౌతుంది. పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉండండి' అని ట్విట్టర్లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1, వార్ సినిమాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటొల శివ దేవరను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఆదివారం (మే 19)న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగానే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఫియర్ సాంగ్' పేరుతో రిలీజైన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇలా ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజైంది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సాంగ్‌కు ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించగా, తెలుగులో ఈ సాంగ్‌కు ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ అందింటారు. 'దేవర ముంగిట నువ్వెంత' అంటూ సాగే ఆ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతూ అభిమానులకూ గూస్బంప్స్ తెప్పిస్తోంది. విజువల్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.