Geethanjali Malli Vachindi OTT :తెలుగు ఆడియెన్స్‌లో హారర్ కామెడీ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రెగ్యులర్‌గా ఇంట్రెస్టింగ్ హారర్ మూవీస్‌ను స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తెస్తుంటాయి. అలా తాజాగా ఇదే బ్యాక్‌డ్రాప్‌తో మరో సినిమా అందుబాటులోకి వచ్చింది. అదే గీతాంజలి మళ్లీ వచ్చింది.
సీనియర్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ఇది. ఇప్పుడీ చిత్రం మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మొదట ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అంతగా కలెక్షన్లు కూడా రాలేదు. టోటల్ రన్ టైమ్‌లో మిక్స్డ్ టాక్‌గా నిలిచింది. అయితే ఇది విడుదలై నెల రోజులు కూడా కాకుండానే మే8న ఆహాలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో కూడా వచ్చేసింది. తాజాగా అది కూడా సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో దర్శనమిచ్చింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా వచ్చి సర్ప్రైజ్ చేసింది.
వాస్తవానికి గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందనే ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత ఆహా దీని హక్కులను కొనుగోలు చేసింది. అంతలోనే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది.