Game Changer Update :గ్లోబల్ స్టార్రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పాట 'రా మచ్చ మచ్చ' ప్రోమోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్ సోమవారం (సెప్టెంబర్ 30) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పాట రాసిన అనంత శ్రీరామ్‌తో నిర్మాత దిల్ రాజు ముచ్చటించారు. అక్టోబరులో ఆ సినిమా టీజర్, మరో పాట విడుదలవుతాయని దిల్ రాజు తెలిపారు.
కంటిన్యూగా ప్రమోషన్స్
అనంత్ శ్రీరామ్‌తో జరిగిన చిట్‌చాట్‌లో నిర్మాత దిల్‌రాజు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు, అప్డేట్స్ షేర్ చేశారు. మెగా ఫ్యాన్స్‌కు అక్టోబర్‌లో ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సినిమా నుంచి మరో పాట, టీజర్ విడుదల చేయనున్నట్లు దిల్‌రాజు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను 2024 క్రిస్మస్కు థియేటర్లలో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ఇకపై అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడు నెలల్లో వరసగా మూవీ ప్రమోషన్స్ చేస్తామని ఆయన అన్నారు.
కాగా, 'రా మచ్చ మచ్చ' పాట ప్రోమోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఫార్మల్ ఔట్ ఫిట్‌లో రామ్‌చరణ్ క్లాసీ లుక్‌లో ఆకట్టుకున్నారు. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లోనే పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫుల సాంగ్ కోసం మెగా ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన తొలి పాట (జరగండి జరగండి)కు కూడా మంచి రెస్పాన్స్ లభించింది.