తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్' అప్​డేట్​ - 'జరగండి' అంటూ వస్తున్న రామ్​చరణ్! ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే? - రామ్​చరణ్ గేమ్​ఛేంజర్ ఫస్ట్ సాంగ్

Game Changer First Single : రామ్​చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న 'గేమ్ ​ఛేంజర్'​ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు గుడ్​ న్యూస్. తాజాగా ఈ చిత్రం ఓ అప్​డేట్​ వచ్చింది.

Game Changer First Single
Game Changer First Single

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 8:12 PM IST

Updated : Mar 5, 2024, 9:41 PM IST

Game Changer First Single: గ్లోబల్​ స్టార్​ రామ్​చరణ్​ తేజ్​, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. అయితే ఈ సినిమా చిత్రీకరణ మొదలై ఎంతో కాలం గడిచినప్పటికీ ఒక పోస్టర్, టైటిల్ తప్ప మరే అప్​డేట్​ లేదు. గతంలో ఈ సాంగ్​ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినా, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు.

కానీ, లీక్స్ కారణంగా అప్పుడు ఈ సాంగ్​ చాలా ట్రెండ్ అయ్యింది. ఈ విషయంపై నిర్మాత దిల్​రాజు కూడా సీరియస్ అయ్యారు. అయితే తాజాగా ఈ సాంగ్ రిలీజ్​కు డేట్​ ఫిక్సైనట్లు తెలుస్తోంది. మార్చి 27న హీరో రామ్​చరణ్ బర్త్​డే రోజే 'జరగండి' (Jaragandi song from Game Changer) అనే పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఇక సాంగ్​తోపాటు, సినిమా విడుదల తేదీని కూడా అదే రోజు అనౌన్స్​ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చెర్రీ ఫ్యాన్స్​ మెగాపవర్ స్టార్ బర్త్​డే (Ram Charan Birthday) కోసం ఈగర్​గా వెయిట్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే 'ఆర్ఆర్ఆర్' తర్వాత పూర్తి స్థాయిలో చరణ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం వల్ల 'గేమ్​ ఛేంజర్' ​పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్​తో దిల్​ రాజ్​ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. ఇక నటి అంజలి, కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్​జే సూర్య, జయరామ్​, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఆయా పాత్రల్లో నటించనున్నారు.

RamCharan Buchibabu Movie: మరోవైపు రామ్​చరణ్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు 'ఆర్​సీ 16' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. విలేజ్ బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్​గా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఈవిషయంపై క్లారిటీ లేదు.

ఎన్టీఆర్ పాత్రలో ట్విస్ట్- 'వార్- 2' కోసం తారక్ తొలిసారి ఆలా- ఫ్యాన్స్​కు పూనకాలు గ్యారెంటీ!

OTTలోకి ​12th Fail తెలుగు వెర్షన్​ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్​!

Last Updated : Mar 5, 2024, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details