Best Animal Based Indian Movies :భారతీయ సినీ పరిశ్రమలో జంతువులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. హీరోకు సమానంగా వాటి పాత్రలను దర్శకులు తీర్చిదిద్దారు. ఇలా సినిమాల్లో నటులతో పాటు జంతువులు ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులు మనసు కొల్లగొట్టిన ఐదు సినిమాలపై ఈ స్టోరీలో ఓ లుక్కేద్దాం.
1. 777 చార్లీ
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ '777 చార్లీ'. దర్శకుడు కిరణ్ రాజ్ ఈ సినిమాకు మానవుడు-శునకం మధ్య ఎమోషన్‌కు చక్కగా చూపించి హిట్ అందుకున్నారు. ఓ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి చిన్నతనం నుంచి ఒంటరిగా జీవితం గడుపుతుంటారు ధర్మ (రక్షిత్ శెట్టి). అలాంటి ధర్మ జీవితంలోకి ఓ రోజు చార్లీ అనే శునకం ఎంట్రీ ఇస్తుంది. అనుకోని పరిస్థితుల్లో యజమాని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఛార్లీ ఎలాంటి ఇబ్బందులు పడింది? ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? చివరికి ఏమైంది? అన్న ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఆఖరి సన్నివేశాల్లో ఆద్యంతం ఉద్వేగంగా సాగిందీ సినిమా.
2. హమ్ ఆప్కే హై కౌన్ (1994)
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ భరత్యాజ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హమ్ ఆప్కే హై కౌన్'. ఈ సినిమాలో మాదురీ దీక్షిత్ హీరోయిన్గా నటించారు. ఇందులో టఫీ అనే శునకం హీరోహీరోయిన్లు మధ్య ప్రేమలేఖలను నడుపుతుంటుంది. ఈ సినిమాలో ఈ కుక్క నటన కూడా హైలెట్‌గా నిలిచింది.