తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల పండుగ - తెలుగు షార్ట్‌ ఫిల్మ్‌కు పురస్కారం

ఓటీటీ సినిమాలకు అవార్డుల పండుగ - వేడుకలో మెరిసిన తెలుగు షార్ట్ ఫిల్మ్​

Filmfare OTT Awards 2024
Filmfare OTT Awards 2024 (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Filmfare OTT Awards 2024 : ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల వేడుక ఆదివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ముంబయి వేదికగా జరిగిన ఈ ఈవెంట్​లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్‌ ఓటీటీలో విడుదలైన చిత్రాలు, అలాగే సిరీస్‌లకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటించారు.

ఇక సినిమా కేటగిరీలో ఉత్తమ నటిగా కరీనా కపూర్‌, అలాగే ఉత్తమ నటుడిగా దిల్జిత్‌ దొసాంజ్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. మరోవైపు ఈ ఈవెంట్​లోనే సాయిదుర్గా తేజ్‌, స్వాతి లీడ్ రోల్స్​లో తెరకెక్కిన 'సత్య'కు పీపుల్స్‌ ఛాయిస్‌ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కింది.

వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన విజేతలు వీరే:

  • ఉత్తమ సిరీస్‌: ది రైల్వే మెన్‌
  • ఉత్తమ దర్శకుడు: సమీర్‌ సక్సెనా, అమిత్‌ గోలానీ (కాలా పాని)
  • ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్‌ రావు (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ: బిశ్వపతి సర్కార్‌ (కాలాపానీ)
  • ఉత్తమ కామెడీ: మామ్లా లీగల్‌ హై
  • ఉత్తమ నాన్‌-ఫిక్షన్‌ ఒరిజినల్‌: ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌
  • ఉత్తమ డైలాగ్స్‌: సుమిత్‌ అరోరా (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)
  • ఉత్తమ నటుడు (డ్రామా): గగన్‌ దేవ్‌ రియార్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)
  • ఉత్తమ సిరీస్‌ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్‌ సీజన్‌ 4)
  • ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్‌ బజార్‌)
  • ఉత్తమ సహాయ నటుడు (కామెడీ): ఫైజల్‌ మాలిక్‌ (పంచాయత్‌ సీజన్‌ 3)
  • ఉత్తమ సహాయనటుడు (డ్రామా): మాధవన్‌ (ది రైల్వే మెన్‌)
  • ఉత్తమ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్‌ హై)
  • ఉత్తమ సహాయ నటి (డ్రామా): మోనా సింగ్‌ (మెడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 2)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎజె నిడిమోరు, కృష్ణ డీకే, సుమన్‌కుమార్‌ (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: కిరణ్ యాద్నోపవిత్‌, కేదార్ పాటంకర్, కరణ్‌ వ్యాస్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: హున్త్సంగ్ మోహపాత్ర, రాహుల్ హెరియన్ ధరమన్ (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)
  • ఉత్తమ ఎడిటింగ్‌: యషా జైదేవ్‌ రాంచందానీ (ది రైల్వే మెన్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: రింపుల్, హర్‌ప్రీత్ నరులా, చంద్రకాంత్ సోనావానే (హీరామండి: ది డైమండ్‌ బజార్‌)
  • ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: సామ్‌ స్లాటర్‌ (ది రైల్వే మెన్‌)
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: సంజయ్‌ మౌర్య (కాలాపానీ)
  • ఉత్తమ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్‌)
  • ఉత్తమ ఒరిజినల్‌ సౌండ్‌ట్రాక్‌: సంజయ్‌ లీలా భన్సాలీ, రాజా హసన్‌ (హీరామండి: ది డైమండ్ బజార్‌)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: ఫిల్మ్‌గేట్‌ ఏబీ, హైవే స్టూడియోస్‌ (ది రైల్వే మెన్‌)

సినిమాలకు సంబంధించిన విజేతలు:

  • ఉత్తమ నటి: కరీనా కపూర్‌ (జానే జాన్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: జైదీప్ అహ్లావత్ (మహారాజ్‌)
  • ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్‌ చంకీల
  • ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ సిరీస్‌ (క్రిటిక్స్‌): గన్స్‌ అండ్‌ గులాబ్స్‌
  • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ముంబయి డైరీస్‌ సీజన్‌ 2
  • ఉత్తమ సిరీస్‌ నటుడు (క్రిటిక్స్‌): కే కే మీనన్ (బొంబాయి మేరీ జాన్‌)
  • ఉత్తమ సిరీస్‌ నటి (క్రిటిక్స్‌): హ్యుమా ఖురేషి (మహారాణి సీజన్‌ 3)
  • ఉత్తమ నటుడు: దిల్జిత్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ సహాయ నటి: వామికా గబ్బి (ఖుఫియా)
  • ఉత్తమ మాటల రచయిత: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఇంతియాజ్‌ అలీ, సాజిద్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్తి బజాజ్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఏఆర్‌ రెహమాన్ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ కథ: జోయా అక్తర్‌, అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ఏఆర్‌ రెహమాన్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
  • ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)
  • ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్‌ రైనా
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జానే జాన్‌
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్ అహ్లావత్
  • ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే


    ఈ ఒక్కరోజే OTTలోకి వచ్చేసిన 11 క్రేజీ సినిమా/సిరీస్​లు - బ్లాక్​ బస్టర్స్​​ 'లక్కీ భాస్కర్​', 'క' కూడా
    డిసెంబర్‌లో అందాల భామల సినిమా జాతర - OTTలోకి రానున్న బడా చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details