తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఈగల్' ట్విట్టర్ రివ్యూ- సక్సెస్ ట్రాక్​లోకి రవితేజ!- సినిమా టాక్ ఏంటంటే? - Eagle Movie review

Eagle Movie Twitter Review: మాస్ మహారాజ రవితేజ- కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ఈగల్ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే?

Eagle Movie Twitter Review
Eagle Movie Twitter Review

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 6:51 AM IST

Updated : Feb 9, 2024, 7:00 PM IST

Eagle Movie Twitter Review:మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ 'ఈగల్' ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. కార్తీక్ ఘట్టమనేని ఫుల్ ఆఫ్ యాక్షన్​ జానర్​లో ఈ సినిమా తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్​లో పవర్​ఫుల్ డైలాగ్స్​తో సినిమాపై ఇప్పటికే బోలెడంత బజ్ క్రియేట్ అయ్యింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఈ మూవీతో మెప్పించారా? సినిమా ఎలా ఉందంటే?

హైదరాబాద్​లో శుక్రవారం తెల్లవారుజామునే పలు సెంటర్లలో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీమియర్స్​కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. 'రావ‌ణాసుర', 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' సినిమాల తర్వాత రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారని సినిమా చూసిన ఆడియెన్స్ అంటున్నారు. రవితేజ కెరీర్​లో బెస్ట్ యాక్షన్ చిత్రాల్లో ఇది ఒకటని, బొమ్మ బ్లాక్​బస్టరంటూ రివ్యూ ఇస్తున్నారు.

సినిమాలో ముఖ్యంగా హీరో రవితేజ నటనతో అదరగొట్టారని టాక్. సెకండ్ హాఫ్​లో యాక్షన్ సీన్స్, క్లైమాక్స్​ పీక్ లెవెల్​లో ఉందని, లాస్ట్ 30 నిమిషాలు థియేటర్లు బద్దలవుతాయని అంటున్నారు. విజువల్స్, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయట. 'టాప్ క్వాలిటీ విజువల్స్, రవితేజ న్యూ అవతార్' అని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేయగా, 'రవితేజ విశ్వరూపం ప్రదర్శించాడు' అని మరో నెటిజన్ రివ్యూ ఇచ్చాడు. ఓవరాల్​గా 'ఈగల్'​కు బ్లాక్​బస్టర్​ టాక్ వస్తోంది. హీరో రవితేజ ఇటీవల మూవీ టీమ్​తో కలిసి స్పెషల్ స్క్రీనింగ్​లో ఈగల్ మూవీ చూశారు. సినిమా చూసిన తర్వాత 'మూవీ ఎక్సెలెంట్, నేను సాటిఫ్ఫై అయ్యా' అని ఒక్క మాటలో చెప్పేశారు. ఇక రెండు సినిమాల తర్వాత మాస్ మహారాజ మళ్లీ ఈగల్​తో సక్సెస్ అందుకున్నట్లే!

Eagle Movie Cast:ఈ సినిమాలో వినయ్ రాయ్, నవదీప్, అజయ్ ఘోశ్, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ మెహతా, శ్రీనివాస్ అవసరాల, ప్రణీత పట్నాయక్ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మించారు. దావ్​జన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించదా కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించారు.

'ఈగల్' ఫుల్ ఆఫ్ యాక్షన్ గ్లింప్స్​ ఔట్- రిలీజ్​కు ముందు బూస్ట్!

'మాట నిలబెట్టుకోండి' - సోలో డేట్ కోసం 'ఈగల్' టీమ్ రిక్వెస్ట్!

Last Updated : Feb 9, 2024, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details