Eagle Movie New Glimpse: మాస్ మహారాజా రవితేజ లీడ్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్' ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 7) మూవీ మేకర్స్ సినిమా నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. 'పద్దతైన దాడి' పేరుతో రిలీజైన వీడియో మొత్తం వైలైంట్గా ఉంది. దీంతో సినిమా కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్‌తో ఉండనున్నట్లు తెలుస్తోంది.
సోలో రిలీజ్:ఇక కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2024 సంక్రాంతికే రిలీజ్ అయ్యేది. కానీ, థియేటర్ల అడ్జెస్ట్మెంట్ కారణాల వల్ల ఈగల్ సంక్రాంతి బరిలోనుంచి తప్పుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ముందుగా చెప్పినట్లుగా ఈ సినిమాకు సోలో రిలీజ్డేట్ ఇచ్చారు. కానీ, ఈ సినిమాతోపాటుగా పలు చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి. అయితే అవి ఈగల్‌పై పెద్దగా ప్రభావం చూపవని అంటున్నారు. దీంతో రవితేజ సినిమా సోలోగా వస్తున్నట్టే చెప్పాలి. ఈ చిత్రానికి వీలైనన్ని థియేటర్లు కూడా దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాతో రవితేజ 'ధమాకా' తర్వాత ఈ రేంజ్ వసూళ్లు సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.
రవితేజ ఫస్ట్ రివ్యూ
Eagle Movie First Review: ఈ సినిమాను రవితేజ రీసెంట్గా చిత్ర బృందంతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సినిమాపై రవితేజ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 'ఈగల్' సినిమా చూసిన తర్వాత 'నేను చాలా సంతృప్తిగా ఉన్నాను' అంటూ ఒక్క మాటలో రవితేజ చెప్పారు. ఇలా తన మాటాల్లో సినిమా మీద రవితేజ ఫస్ట్ రివ్యూను ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్ఫాన్స్ వస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి.