Dulquer Salmaan Lucky Bhaskar Movie : మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో తెరకెక్కి బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తున్న లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు కలెక్షన్లతోనూ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖతాలో వేసుకుంది. ఓవర్సీస్లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరుకుని రికార్డుకెక్కింది. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ ద్వారా తెలియజేశారు. దీపావళికి బ్లాక్బాస్టర్ మూవీ 'లక్కీ భాస్కర్' అన్న క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
కథేంటంటే :
ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) సాధారణ బ్యాంక్ ఉద్యోగి. అంతంతమాత్రంగా వచ్చే జీతం, దానికి తోడు కుటుంబ భారమంతా తనపైనే ఉండటం వల్ల బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వైపు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూనే మరోవైపు కుటుంబాన్ని తనకు వచ్చే ఆ చాలీచాలని జీతంతోనే నెట్టుకొస్తుంటాడు. అయితే బెస్ట్ ఎంప్లాయి అనే పేరు తప్ప అతడికి ప్రమోషన్ మాత్రం రాదు. దీంతో ఎంత రిస్క్ చేసినా సరే తప్పు లేదని భావించి భాస్కర్ ఓ భారీ రిస్క్ చేస్తాడు. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? దీంతో అతడు ఇబ్బందులు ఎదుర్కొన్నాడా? లేకుంటే ఆ కష్టాల్ని దూరం చేసుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.