Dulqer Salmaan Lucky Bhaskar :ఇప్పటివరకూ థియేటర్లలో సందడి చేసిన'లక్కీ భాస్కర్' ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాటినుంచి అక్కడ కూడా టాప్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. దీంతో తాజాగా అభిమానులకు, ఆడియెన్స్‌కు నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు.
"రిలీజైన అన్ని భాషల్లోనూ 'లక్కీ భాస్కర్' మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే ప్రేమను నెట్‌ఫ్లిక్స్‌లోనూ మీరు చూపుతున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలైంది. వాటిలో మూడు వెర్షన్లకు (మలయాళం, తమిళం, తెలుగు) నేనే డబ్బింగ్ చెప్పాను. కానీ సమయం లేనుందున కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పలేకపోయాను. సారీ. కానీ ఈసారి చేసే సినిమాలకు 5 భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన నాటినుంచి ఎన్నో నాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందరికీ ధన్యవాదాలు" అంటూ దుల్కర్ ఓ స్పెషల్ వీడియో మెసేజ్ షేర్ చేశారు.
ఆ రికార్డు కూడా
అయితే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యేంతవరకూ జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'నే టాప్ ప్లేస్‌లో ఉంది. కానీ 'లక్కీ భాస్కర్' వచ్చిన తర్వాత 'దేవర' టాప్3లోకి చేరుకుంది. అంతేకాకుండా 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో 'లక్కీ భాస్కర్' మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల నిర్మాణసంస్థ కూడా సినిమా సక్సెస్ గురించి ఓ పోస్ట్ పెట్టింది.