Hero Suriya Karthi Sister Brunda Sivakumar :నటుడు శివకుమార్ కుమారులు సూర్య, కార్తీ ఇద్దరూ సినిమాల్లో టాప్ హీరోలు. సినీ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ సూర్య, కార్తీ ఇద్దరూ కష్టపడి ఈ రోజు అగ్రస్థానానికి చేరుకున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో సూర్య మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు చిత్రసీమలో బడా హీరోగా ఎదిగారు. భాషతో సంబంధం లేకుండా ఆయన్ను అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సక్సెస్ హీరోగా మంచి క్రేజ్ దక్కించుకున్న సూర్య ఇప్పుడిప్పుడు బాలీవుడ్ వైపు అడుగులువేస్తున్నారు. సూర్య తమ్ముడు కార్తీకి కూడా మంచి పేరుంది. తెలుగులోనూ ఆయన నటించిన సినిమాలు ఎన్నో మంచి హిట్టయ్యాయి. ఇద్దరూ స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తూ బిజీగా మారారు.
అయితే శివకుమార్ చిన్న కుమారుడు కార్తీ, మొదట దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి, ఆ తర్వాత బరుతివీరన్ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. నేడు తమిళ, చిత్రసీమలో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న లోకేశ్ కనగరాజ్, హెచ్.వినోద్‌లు కార్తీ చిత్రాలకు దర్శకత్వం వహించే ఫేమస్ అయ్యారు.
అలా శివకుమార్ కుమారులు సినీరంగంలో పాపులర్ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆయనకు ఓ కూతురు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు. సూర్య, కార్తీతో పాటు ఆయనకు కూతురు బృందా కూడా ఉన్నారు. ఆమె సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాడిన విషయం చాలా మందికి తెలీదు. బృందా శివకుమార్ పొన్‌మగల్ వండల్, జాక్‌పాట్, రచ్చస్సీ, ఓ2 వంటి చిత్రాల్లో పాడారు. అదే విధంగా, బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్‌లో అలియా భట్‌కు బృందా డబ్బింగ్ చెప్పారు.
అయితే ఈమెకు హీరోయిన్‌గా కూడా అవకాశం వచ్చిందట. కానీ ఆమె దానిని తిరస్కరించింది. మణిరత్నం డైరెక్షన్లో తెరకెక్కిన కన్నతిల్ ముత్తమిదళ్ మూవీలో మాధవన్‌కు జోడీగా నటించేందుకు బృందాని మొదట సంప్రదించారట. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందానికి ఈ ఆఫర్ వచ్చింది. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా తిరస్కరించడంతో ఆ పాత్రలో సిమ్రాన్‌ను తీసుకున్నారు.
హీరో సూర్య చెల్లెలు ఎవరో తెలుసా? మణిరత్నం మూవీ ఛాన్స్ వచ్చినా నో చెప్పిందట! - Hero Suriya Karthi Sister - HERO SURIYA KARTHI SISTER
Hero Suriya Karthi Sister Brunda Sivakumar : దక్షిణాది టాప్ హీరోలు సూర్య, కార్తీ చెల్లులు బృందా శివకుమార్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె నటిగా కాకుండా సింగర్ గా రాణిస్తున్నారు.అమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హీరో సూర్య చెల్లెలు ఎవరో తెలుసా? మణిరత్నం మూవీ ఛాన్స్ వచ్చినా నో చెప్పిందట!
Published : Mar 24, 2024, 2:18 PM IST