తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కమల్ హాసన్ తప్ప ప్రపంచంలో ఎవరూ ఆలా చేయలేరు' - INDIAN 2 - INDIAN 2

Kamal Haasan Indian 2: కమల్​ హాసన్ కీలక పాత్రలో రూపొందిన 'భారతీయుడు 2' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఈ ఈవెంట్​లో సినిమా డైరెక్టర్ శంకర్ హీరో కమల్​ నటనకు సంబంధించి కీలక విషయాలు షేర్ చేసుకున్నారు.

Indian 2
Indian 2 (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 5:18 PM IST

Kamal Haasan Indian 2:లోక నాయకుడు కమల్ హాసన్ లీడ్​ రోల్​లో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా 'భారతీయుడు-2'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్​కు సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్లు, కమల్ హాసన్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా కోసం హీరో కమల్ హాసన్ ఎంతగా కష్టపడింది దర్శకుడు శంకర్ ఈవెంట్​లో చెప్పుకొచ్చారు. ఈ మూవీలోని ఓ సీన్ కమల్ తప్పా ప్రపంచంలో మరే నటుడు చేయలేడని అన్నారు. మరి ఈ సీన్ ఏంటంటే?

'సినిమాలో ఒక సీన్​లో కమల్ సర్ ఓ తాడుపై ఉంటారు. ఆ టైమ్​లో ఆయన ప్రోస్తెటిక్ మేకప్​ (ఫేస్​ ప్యాక్ లాంటి మేకప్​)లో ఉంటారు.​ చేతిలో ఓ వస్తువు ఉంటుంది. ఆ పొజిషన్​లో పంజాబీ మాట్లాడాలి. ఆ సీన్​ను మేము స్లో మోషన్ మోడ్​​లో 48 ఫ్రేమ్స్​లో చిత్రీకరించాం. ఇంతటి కాంప్లికేటెడ్ సీన్​లో నటించడం కమల్​ సర్​ తప్పా ఈ ప్రపంచంలో ఏ నటుడికీ సాధ్యం కాదు. ప్రోస్తెటిక్ మేకప్ వేయడానికి 4 గంటలు, తీయడానికి ఒక గంట సమయం పడుతుంది. అలాంటింది కమల్ సర్ దాదాపు 70 రోజుల పాటు ఈ మేకప్ వేసుకున్నారు. నిజంగా ఆయన ఓ గొప్ప నటుడు' అని శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో అన్నారు.

ఇక 1996లో రిలీజైన 'భారతీయుడు'కి ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న ఈ సినిమా జూలై 12న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​ రిలీజ్ అవ్వనుంది.

ఇక ఈ సినిమాలో కమల్​తో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బ్రహ్మానందం, ఎస్‌జే సూర్య, సిద్దార్థ్‌, స‌ముద్రఖని, బాబీ సింహా, మధుబాల, కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్- రెడ్ జేయింట్స్​ బ్యానర్​పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, లైకా సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు.

విక్రమ్ బాటలో 'భారతీయుడు' - లోకేశ్ ఫార్ములా సక్సెస్ అవుతుందా? - Bharateeyudu 2 Movie

'భారతీయుడు -2' రిలీజ్ డేట్ కన్ఫార్మ్- 'మరి గేమ్​ఛేంజర్ సంగతేంటి'? - Bharateeyudu 2 release

ABOUT THE AUTHOR

...view details