తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమాటోగ్రాఫర్​ చోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్ శంకర్ వార్నింగ్​! - Harish Shankar Chota K Naidu - HARISH SHANKAR CHOTA K NAIDU

Harish Shankar Chota K Naidu : తన గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు చేసిన కామెంట్లపై హరీశ్​ శంకర్ ఓ బహిరంగ లేఖ రాశారు. కాస్త ఘాటుగానే బదులిచ్చారు. ఏమన్నారంటే?

సినిమాటోగ్రాఫర్​ చోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్ శంకర్ వార్నింగ్​!
సినిమాటోగ్రాఫర్​ చోటా కే నాయుడుకు దర్శకుడు హరీశ్ శంకర్ వార్నింగ్​!

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 6:39 PM IST

Updated : Apr 20, 2024, 6:52 PM IST

Harish Shankar Chota K Naidu :తన గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు చేసిన కామెంట్లపై హరీశ్​ శంకర్ ఓ బహిరంగ లేఖ రాశారు. కాస్త ఘాటుగానే బదులిచ్చారు. తనను మళ్లీ కెలుక్కుంటేany day any platform I AM WAITING ఇట్లు భవదీయుడు హరీశ్​ శంకర్ అంటూ ఆయన రాసుకొచ్చారు.

అసలేం జరిగిందంటే? - ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్యా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్​గా పనిచేసిన ఛోటా కె నాయుడు రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. షూటింగ్ సమయంలో హరీశ్​ తన పనిలో జోక్యం చేసుకునేవారని, ఎంత నచ్చచెప్పాలని ప్రయతించినా వినలేదని కామెంట్ చేశారు ఛోటా. చివరకు హరీశ్​కు నచ్చినట్లుగానే పనిచేయాల్సి వచ్చిందని, తనకు కోపం వచ్చినా తర్వాతి నిమిషంలో డైరెక్టర్​కు స్క్రిప్ట్ మీద మరింత అవగాహన ఉంటుంది అని సర్దుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఛోటా మాట్లాడిన మాటలు దర్శకుడు హరీశ్​కు తీవ్రంగా కోపం తెప్పించాయి.

దీంతో హరీశ్ తాాజాగా తన సోషల్ మీడియా అకౌంట్​లో ఛోటాను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అందులో "వయసులో పెద్ద కాబట్టి)గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకు మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్​తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్​ను తీసేస్తున్నాడు అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే "గబ్బర్ సింగ్" వచ్చినప్పుడు నాది "రామయ్య వస్తావయ్య" వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ ఇలానే చేస్తానని అంటే any day any platform I AM WAITING -భవదీయుడు హరీష్ శంకర్" అని ఛాలెంజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్​గా మారింది.

Last Updated : Apr 20, 2024, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details