DilRaju Son Reception : ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు, హీరో ఆశిశ్ పెళ్లి రీసెంట్గా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న అద్విత అనే యువతితో ఘనంగా జైపుర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. ఈ సందర్భంగా తాజాగా ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో ఆశిష్ – అద్వితల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్‌కు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు సహా పలువురు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు.
అయితే ఆశిశ్ – అద్విత వెడ్డింగ్ రిసెప్షన్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోనే నెటిజన్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఎందుకంటే ఇందులో విజయ్ దేవరకొండను చూడగానే దిల్ రాజు కోడలు, పెళ్లికూతురు అద్విత చాలా ఎగ్జైట్మెంట్గా ఫీలైంది. తన ఫేవరేట్ హీరోను మొదటిసారి చూసినట్టుంది. అందుకే ఒక్కసారిగా చూడగానే ఎగ్జైటింగ్‌గా ఫీలైయింది. వీడియోలో ఆశిశ్ అద్వితను విజయ్ దేవరకొండకి పరిచయం చేయగా విజయ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయ్ వారితో కలిసి ఫోటో దిగారు.
ప్రస్తతం ఈ వెడ్డింగ్ రిసెస్షన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. విజయ్ను చూడగానే అద్విత ఆశ్చర్యంతో, ఆనందంతో పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్ బాగా హైలైట్ అయింది. దీనికి ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అని క్యాప్షన్ జోడించి దిల్ రాజు కోడలు కూడా విజయ్ దేవరకొండ అభిమానే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.