Dhanush New Movie : కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. కథల ఎంపికలో ప్రత్యేకత చూపించే ఆయన ఓవైపు గ్యాప్ లేకుండా వరుస సినిమాల షూటింగ్లలో పాల్గొంటూనే మరోవైపు కొత్త ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తున్నారు.
సాధారణంగా మనం చిత్ర పరిశ్రమలో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నావారిని చూస్తుంటాం. దర్శకుడిగా వరుస చిత్రాలను చేస్తున్నవారిని చూస్తుంటాం. కానీ ధనుశ్ రెండింటిలోనూ దూసుకెళ్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా వరుసగా చిత్రాలను చేసేస్తున్నారు. రీసెంట్గా స్వీయదర్శకత్వంలో 'రాయన్' చిత్రంతో వచ్చి అటు దర్శకుడిగానూ ఇటు నటుడిగానూ మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది.
Dhanush Direction Movies : ఇప్పుడు తాజాగా ధనుశ్ మరో కొత్త సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. ఇడ్లీ కడై(DD4) అనే పేరను ఖరారు చేశారు. ఇది కూడా ధనుశ్ స్వీయదర్శకత్వంలోనే తెరకెక్కనుండటం విశేషం. నటుడిగా ధనుశ్కు ఇది 52వ చిత్రం. దర్శకుడిగా నాలుగో చిత్రం. ఇప్పటికే ఆయన గతంలో పా పాండి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే ప్రియా ప్రకాశ్ వారియర్, అనిఖా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న నిలవుక్కు ఎన్మెల్ ఎన్నాడి కోబమ్(Nilavuku En Mel Ennadi Kobam) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది డిసెంబరు 21న రిలీజ్ కానుంది.