తెలంగాణ

telangana

భయమంటే ఏంటో తెలియాలంటే 'దేవర' కథ వినాలి! - ఇంట్రెస్టింగ్​గా రిలీజ్ ట్రైలర్! - Devara Release Trailer

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Devara Release Trailer : 'దేవర' సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ రిలీజ్ ట్రైలర్​ను విడుదల చేసి అలరించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Devara Release Trailer
Devara Release Trailer (ETV Bharat)

Devara Release Trailer :మ్యాన్ ఆఫ్​ మాసెస్ జునియర్ ఎన్​టీఆర్ ఇప్పుడు అభిమానుల కోసం 'దేవర'గా వచ్చేందుకు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్​ను విడుదల చేశారు. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్​తో ఆద్యంతం ఎంగేజింగ్​గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటోంది.

భయం పోవాలంటే దేవుడి కథ వినాలి, భయమంటే ఏంటో తెలియాలంటే 'దేవర' కథ వినాలి! అంటూ సాగే డైలాగ్స్ సినిమాకు మరింత హైప్ పెంచుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్​టీఆర్ డ్యూయెల్ రోల్ ఇందులో విశేషంగా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు యాక్షన్, మరోవైపు ఎమోషన్ ఇలా రెండింటినీ తన నటనతో ఎన్​టీఆర్ బ్యాలెన్స్ చేసినట్లు ట్రైలర్ ఆద్యంతంలో కనిపిస్తోంది.

ఇక సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల అంటూ సైఫ్​ అలీఖాన్ చెప్పే డైలాగ్​, అలాగే ఆయన క్యారెక్టరైజేషన్​ కూడా సినిమాలో కీలక పాత్ర కానున్నట్లు కనిపిస్తోంది. ఇతర క్యారెక్టర్లు కూడా తమ నటనతో అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటించనున్నారు. ఈ సినిమాలో ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నారు. శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్​టీఆర్, యువసుధ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ జారీ చేసింది. కాగా, సినిమా రన్​టైమ్​ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్​టీఆర్ తీసిన సినిమా కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక మూవీలో విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అని హీరో ఎన్​టీఆర్ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్​టీఆర్ అంచనాలు రెట్టింపు చేశారు.

నార్త్​ అమెరికాలో 'దేవర' విధ్వంసం! - వారంలోనే ఆ హిట్ మూవీ రికార్డును బ్రేక్​ చేసేందుకు రెడీ! - Jr NTR Devara Movie

'దేవర' వీఎఫ్​ఎక్స్​ కోసం 30 రోజులు నిద్ర లేకుండా - అంచనాలకు మించేలా! - NTR Devara Movie VFX

ABOUT THE AUTHOR

...view details