Devara OTT Release : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'దేవర'. పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్లింది. దసరా కానుకగా వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సౌత్ భాషల్లో నవంబర్ 8న అలాగే హిందీలో నవంబర్ 22న వస్తుందట. అయితే ఈ విషయం గురించి సినిమా రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఓటీటీ రిలీజ్‌కు మరికొద్ది రోజులే టైమ్ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా రిలీజ్ చేస్తే చూడాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో హై లెవెల్ గ్రాఫిక్స్‌తో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. తంగం అనే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించి అభిమానులను అలరించారు.