Devara Korata Siva Chiranjeevi :అప్పటివరకు టాలీవుడ్లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కానీ ఆచార్య తర్వాత ఆ పేరు పోయింది. ఎందుకంటే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు దారుణంగా డిజాస్టర్ అయింది. దీని తర్వాత చిరు ఓ స్టేజ్‌పై చేసిన వ్యాఖ్యలు కాస్త కాంట్రవర్సీకి దారీ తీశాయి. అది ఆయన ఆచార్య ఫ్లాప్‌ను దృష్టిలో పెట్టుకుని, కొరటాలను ఉద్దేశించే చెప్పారని జోరుగా ప్రచారం సాగింది. అలా అప్పటి నుంచి చిరు - కొరటాలకు మధ్య మనస్పర్థలు వచ్చాయని తెగ వార్తలు వచ్చాయి.
దీంతో ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని, పట్టుదలతో కొరటాల దేవరను తెరకెక్కించినట్లు మాటలు వినిపించాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఈ సినిమా చేశారు కొరటాల. ఇప్పుడు విడుదల తేదీ(సెప్టెంబర్ 27) దగ్గర పడడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది.
అయితే తాజాగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు కొరటాల. ఈ నేపథ్యంలో ఆచార్య కాంట్రవర్సీ, మెగా కాంపౌండ్‌తో ఉన్న బంధంపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి కొరటాల సమాధానం చెప్పారు. ఆచార్య ఫ్లాప్ అవ్వగానే తనకు మెసేజ్ చేసిన తొలి వ్యక్తి చిరంజీవినేనని అన్నారు కొరటాల. 'అంతా బానే జరుగుతుంది. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతావ'ని మెసేజ్ చేసి ధైర్యాన్ని, భరోసా ఇచ్చారట. అలా ఫైనల్‌గా చిరు చేసిన మెసేజ్ గురించి కొరటాల ఎట్టకేలకు బయట పెట్టారు. పైగా చిరు గతంలో చేసిన కామెంట్స్‌ను చాలా మంది వక్రీకరించారని, తప్పుగా అర్థం చేసుకున్నారని, తనను ఉద్దేశించి చిరు అనలేదని క్లారిటీ ఇచ్చారు కొరటాల. తమ మధ్య అనుబంధం అంతా బాగానే ఉందని స్పష్టత ఇచ్చారు.