తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ డైరెక్టర్​ సలహాతోనే జాన్వీ కపూర్​ టాలీవుడ్​ ఎంట్రీ! - అందుకే 'దేవర'కు గ్రీన్​సిగ్నల్​ - Janhvi Kapoor Tollywood Entry - JANHVI KAPOOR TOLLYWOOD ENTRY

Devara Janhvi Kapoor Tollywood Entry : 'దేవర'తో త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది జాన్వీ కపూర్​. అయితే ఈ అమ్మడు టాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వడం వెనక ఓ ప్రముఖ దర్శక నిర్మాత ఉన్నట్లు సమాచారం.

source Getty Images
Devara Janhvi Kapoor (source Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2024, 4:25 PM IST

Devara Janhvi Kapoor Tollywood Entry : అలానాటి అందాల తార శ్రీ దేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ జాన్వీ కపూర్‌. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమిస్తోంది. బాలీవుడ్‌లో ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేసింది. త్వరలోనే దేవర చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, అందులోని జాన్వీ గ్లామర్, డ్యాన్స్​లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం వెనక ఓ ప్రముఖ దర్శకనిర్మాత సలహా ఉన్నట్లు తెలిసింది. ఆయన ఎవరంటే కరణ్ జోహార్ అని టాక్ వినిపించింది. బీటౌన్​లో చాలా మంది స్టార్ కిడ్స్​, యంగ్ యాక్టర్స్​ తమ కెరీర్‌ గురించి కరణ్‌ జోహర్​ను సలహాలు అడిగి తీసుకుంటారట.

అలానే జాన్వీ కపూర్​కు కూడా కరణ్ జోహార్​​ ఓ అడ్వైస్ ఇచ్చారట. బాలీవుడ్ తర్వాత జాన్వీకు కోలీవుడ్, టాలీవుడ్​లో అవకాశాలు వచ్చాయట. అయితే ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో కరణ్‌ను సలహా జాన్వీ కోరిందట. అప్పుడు ఎన్టీఆర్‌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తే మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆయన అన్నారట. దీంతో జాన్వీ దేవరకు ఓకే చేశారట.

ఇప్పుడీ భామ దేవరలోనే కాదు టాలీవుడ్​లో మరిన్ని అవకాశాలు అందుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రామ్​చరణ్​ ఆర్​సీ 16కు ఎంపిక అయింది. నాని చేయబోయే ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం.

Devara Release Date : కాగా, బాలీవుడ్​లో జాన్వీ కపూర్ చిన్న, యంగ్ హీరోస్​ సినిమాల్లోనే నటిస్తున్నారు. కానీ, తెలుగులో మాత్రం స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో ఇక్కడ ఆమె స్టార్​ హీరోయిన్​ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే దేవర చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెరీర్​లోలో 180 ఫ్లాపులు! - అయినా ఇప్పటికీ ఆ హీరో సూపర్ స్టారే! - Most Flops Hero

సంచలనం సృష్టించిన 'స్త్రీ 2' బంపర్ ఆఫర్‌ - ఒక టికెట్‌ కొంటే మరొకటి ఫ్రీ - Stree 2 Free Ticket Offer

ABOUT THE AUTHOR

...view details