Dasara 2024 Box Office Movies : ఈ దసరా ప్రేక్షకులకు వినోదాల విందు పంచేందుకు సిద్ధమైంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్కు క్యూ కడుతున్నాయి. ఒకేసారి ఐదు పెద్ద సినిమాలు రిలీజ్కు సిద్ధమవ్వడంతో బాక్సాఫీస్ వార్ తప్పేలా కనిపించడం లేదు. పైగా అన్నీ సినిమాలు అగ్ర కథానాయకులదే కావడం మరో విశేషం.
Vettaiyan Release Date : సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న వేట్టయాన్ అక్టోబర్ 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారాలతో క్రైమ్ యాక్షన్ డ్రామాగా దీని రూపొందిస్తున్నారు.
Kanguva Release Date : స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ స్టార్ బాబీ దేఓల్ కలిసి నటిస్తున్న కంగువ కూడా అక్టోబర్ 10నే రానుంది. బానిసత్వం చెల్లదంటూ పోరాటం చేసిన ఓ వీరుడి కథే ఈ కంగువా. శివ దర్శకుడు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్.
Vicky Vidya ka Woh Wala Release Date : హిందీలో రాజ్ కుమార్ రావ్, త్రిప్తి దిమ్రి నటిస్తున్న విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో సినిమా కూడా ఈ దసరాకే ప్రేక్షకుల ముందుకు రానుంది.