Daaku Maharaj Success Meet :నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో మంచి సక్సెస్ అందుకున్నారు. డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో మూవీటీమ్ హైదరాబాద్‌లో శుక్రవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో హీరో బాలయ్య సహా, చిత్ర యూనిట్ పాల్గొంది.
అయితే సినిమాలో ముఖ్యంగా సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు ఫుల్ క్రేజ్ వస్తోంది. తమన్ అందించిన సంగీతానికి బాలయ్య అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దీంతో తమన్‌ను 'నందమూరి తమన్' అంటూ సోషల్ మీడియాలో సరదగా పిలుస్తున్నారు. అయితే దీనిపై సక్సెస్‌మీట్‌లో బాలయ్య స్పందించారు. ఇంతటి అద్భుతమైన మ్యూజిక్ అందించిన తమన్‌ను ఆయన కూడా ప్రశంసించారు.
ఈ క్రమంలోనే ఫ్యాన్స్ 'నందమూరి తమన్' అని పిలవడంపై ఆయన స్పందిస్తూ, మ్యూజిక్ డైరెక్టర్‌కు కొత్త పేరు పెట్టారు. 'తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ అతని ఇంటి పేరు మార్చేశారు. ఎస్ ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని అంటున్నారు. కానీ, నందమూరి కూడా కాదు. ఈరోజు నుంచి ఇతడు 'NBK తమన్'. అని నామకరణం చేస్తున్నా (నవ్వుతూ)' అని అన్నారు. ఇక ఇదే ఈవెంట్లో బాలయ్య మూవీటీమ్ అందరినీ ప్రశంసించారు.