Colour Photo Hero Suhas Becomes Father : 'కలర్ ఫొటో' ఫేమ్, నటుడు సుహాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రొడక్షన్ నెం.1 అబ్బాయి పుట్టాడు అంటూ కొడుకును పరిచయం చేశారు. ఆస్పత్రి బెడ్‌పై తన భార్య లిఖిత పడుకుని ఉండగా పక్కనే బిడ్డను ఎత్తుకుని కనిపించారు సుహాస్. ఈ ఫొటోను షేర్ చేసిన ఆయన 'మగబిడ్డ పుట్టాడు. ప్రొడక్షన్ నెం1' అంటూ రాసుకొచ్చారు. అయితే మిగతా సెలబ్రెటీలలాగానే సుహాస్ కూడా తన కుమారిడి మొఖం చూపించలేదు. ఫేస్ దగ్గర లవ్ సింబర్ పెట్టి ఫొటో షేర్ చేశారు. సుహాస్ 2017లో తన ప్రేయసి లిఖితను ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఏడేళ్లకు ఈ జంటకు కొడుకు పుట్టడంతో సుహాస్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.
స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది : గతంలో ఓ ఇంటర్య్వూలో సుహాస్ మాట్లాడుతూ తన భార్య లిఖిత డిగ్రీలో తనకు క్లాస్ మేట్ అని చెప్పారు. 2009 నుంచి తామిద్దరు ప్రేమించుకున్నట్టు తెలిపారు. "డిగ్రీలో లిఖిత పరిచయమైంది. అప్పుడే ఒకరినొకరం ఇష్టపడ్డాం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన గురించే ఆలోచించేవాడిని. మొదటి నుంచి తనే నాకు బాగా హెల్ప్ చేసింది. తను జాబ్ చేస్తూనే ఇంట్లో ఒప్పించింది. ఆర్ధికంగా అండగా ఉండడంతో పాటు మెంటల్‌గా కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చింది" అంటూ చెప్పారు.
కాగా, సహాస్ - 'మజిలీ', 'డియర్ కామ్రేడ్', 'ప్రతి రోజు పండగే' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నేచురల్ యాక్టింగ్‌తో లీడ్ రోల్స్‌లో నటించే స్థాయికి ఎదిగారు. కలర్ ఫొటో సినిమా ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన స్టార్‌గా మారారు.