Citadel Honey Bunny Samantha Priyanka Chopra : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ హీరోయిన్ సమంత కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటడెల్ : హనీ-బన్నీ. రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్ ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ ఈవెంట్‌కు సమంతో పాటు సిటాడెల్ ఒరిజినల్ వెర్షన్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా సమంత - ప్రియాంక చోప్రా కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, సరదాగా ముచ్చటించుకుంటూ, నవ్వుకుంటున్న ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు కూడా వీటిని తెగ షేర్ చేస్తున్నారు. సిటడెల్ ఇండియన్ వెర్షన్ విడుదల తేదీ చెప్పాలని అడుగుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Citadel Honey OTT Platform : ఈ సిటాడెల్ సిరీస్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ (హాలీవుడ్) వెర్షన్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. కానీ ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడిదే సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించారు. 'సిటడెల్ : హనీ-బన్నీ' పేరుతో త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ కానుంది.