Chiranjeevi Vishwambara :మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' సెట్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు కీలక షెడ్యూల్స్ ముగించుకుని చిత్రీకరణ జరుపుకుంటుండగా, చిరు తాజాగా ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. తనకు పాత రోజులు గుర్తొచ్చాయంటూ పేర్కొన్నారు. కీరవాణీ బర్త్‌డే స్పెషల్ అంటూ ఆయనకు విషెస్ చెప్తూ ఈ వీడియోను షేర్ చేశారు.
"గతంలో సినిమాలకు పాటలు కంపోజ్ చేయాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల గురించి చర్చించుకుని ఫైనల్ చేసేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. విశ్వంభర సినిమాతో మళ్ళీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు. మా ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన టీమ్‌తో కలిసి విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు." అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్‌లో చిరుతో పాటు డైరెక్టర్ వశిష్ఠ, మిగతా మూవీటీమ్ పాల్గొని సందడి చేశారు.
ఇక చిరు కూడా కీరవాణితో సరదాగా ముచ్చటించారు. పాత రోజులను గుర్తుచేసుకున్నారు. అయితే ఈ వీడియోలో చిరు సూపర్‌హిట్ మూవీ 'ఆపద్భాంధవుడు'లోని 'చుక్కలారా చూపుల్లారా' అంటూ సాంగ్‌ను కీరవాణి అక్కడే కంపోజ్ చేస్తూ పాడారు. చిరుతో పాటు మూవీ టీమ్ మొత్తం ఆ పాటను వింటూ ఆస్వాదించారు.