Chiranjeevi PadmaVibhushan : టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తన నటనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతోనూ ప్రజల మనసుల్లో నిలిచారు. అయితే ఆయన ఈ ఏడాది దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి గతంలో సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఏమని చెప్పారో తెలుసుకుందాం.
1. బ్రదర్ చిరంజీవిలోని క్రమశిక్షణ, వినయ విధేయతలే అతడిని ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళాయి. - ఎన్టీ రామారావు
2. చిరంజీవి కళాకారుడు కాదు, కళాకార్మికుడు. - రావు గోపాలరావు
3. చిరంజీవి కళ్ళంటే నాకెంతో ఇష్టం. ఆ కళ్ళల్లో పులి చూపు, లేడి చూపూ రెండూ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా మలుచుకోగల నటుడు చిరంజీవి.- బాపు
4. చిరంజీవిని చూస్తే నాకు ఈర్ష్య. అతడు నాకన్నా అందగాడు కాదు, కానీ శాస్త్రీయ, జానపద, డిస్కో, బ్రేక్ ఇలా ఏ డ్యాన్స్ అయినా అది చిరంజీవి చేస్తేనే అన్పించేట్టు చేస్తాడు. అందుకే చిరంజీవి అంటే నాకు ఆనందంతో కూడిన అసూయ! - కమల్ హాసన్
5. తన స్టెప్స్‌తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే చిరంజీవిని చూసి అసూయపడతాను - రజనీకాంత్
6. మా ముందున్న ఏకైక లక్ష్యం చిరంజీవిగారు. అసలు ఆయనంటూ లేకుంటే మాకొక లక్ష్యం లేకుండా పోయుండేది, అంతటి గొప్ప ఆర్టిస్టు చిరంజీవిగారు!! - వెంకటేశ్
7. ఇండియాలో డ్యాన్స్ అద్భుతంగా చేయగల హీరో చిరంజీవిగారొక్కరే!! - నాగార్జున
8. నేను అభిమానించే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి - గోవిందా
9. రజనీకాంత్ + కమల్‌హాసన్ = చిరంజీవి -కె. బాలచందర్
10. చిరంజీవి '' God of Andhra Pradesh - ప్రవేశ్ సిప్పి
11. చిరంజీవి ఇమేజ్ అనితర సాధ్యం! చిరంజీవి లాంటి నటుడు భారతీయుడు కావడం గర్వకారణం. - అనిల్ కపూర్
12. 'చిరంజీవిలోని డిసిప్లిన్, డెడికేషన్ ఇంతదాకా ఏ హీరోలోను నేను చూడలేదు'. - ఎన్.ఎన్. సిప్పీ
13. ఇండస్ట్రీకి లాస్ట్ నంబర్వన్ హీరో మెగాస్టార్ చిరంజీవిగారే! - మహేశ్ బాబు