Chiranjeevi On Ram Charan:మెగాస్టార్ చిరంజీవి తన బ్లాక్‌బస్టర్ మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విశ్వంభర షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు విషయాలు షేర్ చేసుకున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా రెండో పార్ట్‌లో ఆయన కుమారుడు రామ్‌చరణ్- జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని అన్నారు. ఇది తన కల అని, దానికోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మెగాస్టార్ చెప్పారు. అది త్వరలోనే జరగాలని ఆయన ఆశించారు.
ఇక రామ్‌చరణ్- జాన్వీ కపూర్ కలిసి ఈ సినిమా చేస్తే బాగుంటుందని చిరంజీవి గతంలోనూ అభిప్రాయపడ్డాయి. ఆయన 150వ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విషయాన్ని చెప్పారు. అయితే వీరిద్దరూ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. గతనెల మార్చిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా 'ఆర్సీ 17' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఇక సినిమాలో నటించే ఆర్టిస్ట్‌ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.