తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మెగా - మంచు ఫ్యామిలీ వివాదం - ఇన్నాళ్లకు ఓపెన్ అయిన మంచు మనోజ్​ - Chiranjeevi Mohan Babu - CHIRANJEEVI MOHAN BABU

Chiranjeevi Mohan Babu : మెగా ఫ్యామిలీ - మంచు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయని ఒప్పుకున్నారు మంచు మనోజ్​. అసలు విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే?

మెగా - మంచు ఫ్యామిలీ వివాదం - ఇన్నాళ్లకు ఓపెన్ అయిన మంచు మనోజ్​
మెగా - మంచు ఫ్యామిలీ వివాదం - ఇన్నాళ్లకు ఓపెన్ అయిన మంచు మనోజ్​

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 11:32 AM IST

Chiranjeevi Mohan Babu :మెగా ఫ్యామిలీ - మంచు ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు చాలా సార్లు ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పట్లో మా ఎలెక్షన్స్ సమయంలో బాగా ఎక్కువగా వినిపించింది. అయితే దీనిపై తాజాగా మంచు మనోజ్ స్పందించారు. చిరంజీవి - మోహన్‌ బాబు టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని అన్నారు. రామ్‌ చరణ్‌ తన ప్రాణ మిత్రుడని చెప్పారు. చరణ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లో వేడుకలు (Ram Charan Birthday Celebrations) గ్రాండ్​గా జరిగాయి. అలా ఓ ఈవెంట్‌కు మనోజ్‌తో పాటు హీరోలు కిరణ్‌ అబ్బవరం, నిఖిల్‌, దర్శకులు బుచ్చిబాబు, బాబీ తదితరులు గెస్ట్​లుగా వెళ్లి సందడి చేశారు.

"చరణ్‌ ఎంతో గొప్ప నటుడు. అంతే గొప్ప మనిషి కూడా. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తట్టుకోలేడు. వెంటనే సాయం చేస్తాడు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఓ తెలుగు కుటుంబం దుబాయ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిసింది. అప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఈ విషయం రామ్‌ చరణ్‌కు ఫోన్‌ చేసి చెప్పాను. నా వంతు సాయం చేశాను ఇంకా రూ. ఐదు లక్షలు తక్కువయ్యాయి అని అన్నాను. తక్షణమే డబ్బు పంపాడు. ఆ ఫ్యామిలీకి ఆశీస్సులు చరణ్‌కు ఎప్పుడూ ఉంటాయి. అతను స్నేహానికీ వ్యాల్యూ ఇస్తాడు. చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్​తో ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాడు" అని మనోజ్ చెప్పుకొచ్చారు.

"కొంతమంది మీ నాన్న, రామ్‌ చరణ్‌ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు కదా. మీరెలా కలిసి ఉంటున్నారురా? అని అడిగారు. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకుంటే ఆ వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని తిరిగి నేను ప్రశ్నించాను. వాళ్లిద్దరు టామ్‌ అండ్‌ జెర్రీలాగా ఉంటారు. దాదాపు 45 ఏళ్ల అనుబంధం వారిద్దరది. మాలాగే ఆ ఇద్దరు కూడా ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అని మనోజ్ అన్నారు. పెదరాయుడు చిత్రంలోని పాపులర్​ డైలాగ్‌ను రీక్రియేట్‌ చేసి ఫ్యాన్స్​లో జోష్‌ నింపారు. ఎ రిలేషన్‌ బెట్వీన్‌ మెగా ఫ్యామిలీ అండ్‌ మంచు ఫ్యామిలీ షుడ్‌బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ వాటర్‌. బట్‌ షుడ్‌ నాట్‌ బీ లైక్‌ ఎ ఫిష్‌ అండ్‌ ఫిషర్‌మ్యాన్‌ అంటూ కూడా చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌ కేరంతలతో హోరెత్తించారు.

సిద్ధు జొన్నలగడ్డ సీరియస్ - హర్ట్ అయిన అనుపమ! - Tillu Square Anupama Parameshwaran

ఛార్మితో పాటు నిర్మాతలుగా మారిన ఈ 11 మంది తెలుగు హీరోయిన్స్​ తెలుసా? - Tollywood Heroines as Producers

ABOUT THE AUTHOR

...view details